Heroes: ఈ హీరోలకి మోస్ట్ మెమరబుల్‌గా నిలిచిన 2023.. బ్లాక్ బస్టర్స్ తో బౌన్స్ బ్యాక్..
2023 చాలా మంది హీరోలకు మోస్ట్ మెమరబుల్‌గా నిలిచింది. ముఖ్యంగా చాలా కాలంగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న స్టార్స్ ఈ ఏడాదిలో గ్రాండ్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యారు. మరికొంత మంది సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ రికార్డ్‌లు సెట్ చేశారు. 02.2023 సౌత్ సినిమాకు గోల్డెన్ ఇయర్ లాంటిది. ఈ ఏడాది మన సినిమా నయా హైట్స్‌ను టచ్ చేసింది. పాన్ ఇండియా రేంజ్‌లో సౌత్ మేకర్స్ జోరు పక్కాగా కనిపించింది. అంతే కాదు ఎన్నో ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల కెరీర్‌ను కూడా గాడిలో పెట్టింది 2023.