Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VV Vinayak: మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఎక్కడున్నారు..? రెండు ఫ్లాపులు వచ్చేసరికి భయపడిపోయారా..?

మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఎక్కడున్నారు..? ఒకప్పటి నెంబర్ వన్ మాస్ డైరెక్టర్‌ కొన్నేళ్లుగా ఎందుకు కనిపించడం లేదు..? రెండు ఫ్లాపులు వచ్చేసరికి భయపడిపోయారా..? ఈ మధ్య అసలు బయట కనిపించడమే మానేసిన ఈయన ఆ మధ్య చిరు సినిమా ఓపెనింగ్‌కు మాత్రమే ఎందుకు వచ్చినట్లు..? ఈయన నెక్ట్స్ సినిమా రవితేజతో ఉండబోతుందా లేదంటే ఏదైనా మెగా ట్విస్ట్ ఉండబోతుందా..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Dec 13, 2023 | 3:52 PM

అయితే అఖిల్ తర్వాత ఈయన గ్రాఫ్ పడిపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన అఖిల్ డిజాస్టర్ అయింది.. ఆ తర్వాత ఇంటిలిజెంట్‌తో పూర్తిగా ఫేడవుట్ అయిపోయారు వినాయక్.

1 / 5
రవితేజతో గతంలో కృష్ణ సినిమా చేసారు వినాయక్. కొన్ని రోజుల కింది వరకు రవితేజ సినిమా డిస్కషన్ నడిచింది కానీ కథ వర్కవుట్ అవ్వక ఆ ప్రాజెక్ట్ వదిలేసారు. కానీ చిరు సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు వినాయక్. మెగా 156 ఓపెనింగ్‌లో ఈ డైరెక్టర్ కనిపించడానికి కారణం అదే. ఈ కాంబినేషన్‌లో ఠాగూర్, ఖైదీ నెం 150 వచ్చాయి. ఇదే నమ్మకంతో చిరు మరోసారి వినాయక్‌కు ఛాన్సిస్తారేమో చూడాలిక.

2 / 5
ఖైదీ నెం 150 హిట్టైనా కూడా అది పూర్తిగా చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది.. పైగా రీమేక్ కావడంతో వినాయక్‌కు క్రెడిట్ రాలేదు. 2018 తర్వాత తెలుగులో సినిమాలేం చేయలేదు వినాయక్. ఈ మధ్యే హిందీలో చత్రపతి రీమేక్ చేసినా.. ఫలితం శూన్యం. బయట కూడా కనిపించడం మానేసారీయన. ఇలాంటి టైమ్‌లో రవితేజతో సినిమా ఉందనే ప్రచారం జోరందుకుంది.. కానీ ఇందులో నిజం లేదు.

3 / 5
ఆది, దిల్, ఠాగూర్, బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, ఖైదీ నెం 150.. ఇలా వినాయక్ కెరీర్‌లో ఎన్నో కమర్షియల్ హిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు రాజమౌళి కంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వినాయక్.

4 / 5
వివి వినాయక్.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు. తెలుగు ఇండస్ట్రీలో మాస్‌కు కొత్త అర్థం చెప్పిన దర్శకుడీయన. అప్పటి వరకు ఉన్న కమర్షియల్ సినిమాను తన మేకింగ్‌తో మరో స్టెప్ ఎక్కించారు వినాయక్. అయితే టైమ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. అందుకే కొన్నేళ్లుగా ఈ దర్శకుడు కనిపించడం లేదు. చాలా రోజుల తర్వాత వినాయక్ నెక్ట్స్ సినిమాపై చర్చ మొదలైంది.

5 / 5
Follow us