Tollywood News: స్టార్ హీరోల అప్ కమింగ్ మూవీ షూటింగ్స్ అప్‌డేట్స్
శ్రావణ మాసంలో ఓ వైపు పండగలు, మరో వైపు పెళ్లిళ్లతో సొసైటీ కళకళలాడుతోంది. అవి ఎలాగూ ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. కాస్త సమయం చూసుకుని వెళ్లొచ్చేస్తే సరిపోతుంది. మనకు మాత్రం చేతినిండా పని ఉండటమే పండగ అని అంటున్నారు స్టార్ హీరోలు. పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ముందుకు దూసుకుపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా విశ్వంభర.