- Telugu News Photo Gallery Cinema photos Can You Know This Actress In The Photo, Her Name Is Shriya Saran School Days Pic
Tollywood : 42 ఏళ్ల వయసులో తగ్గని వయ్యారం.. గ్లామరస్ బ్యూటీ రచ్చ.. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ క్యూ కట్టిన ఆఫర్స్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ తెగ వైరలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కట్టిపడేసిన ఆమె ఇప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..
Updated on: Sep 27, 2025 | 9:59 AM

పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న హీరోయిన్. ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్న ఫోటో ఇప్పుడు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చీరకట్టులో తన స్నేహితులతో కలిసి తరగతి గదిలో దిగిన ఫోటోను నెట్టింట పంచుకుంది. ఆమె ఎవరంటే..

ఆ బ్యూటీ మరెవరో కాదండి హీరోయిన్ శ్రియా శరణ్. భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్. 2003లో జెనీలియా డిసౌజా, రితేష్ దేశ్‌ముఖ్ నటించిన తుఝే మేరీ కసమ్ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత 2001లో విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఇష్టం మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

తెలుగులో అగ్ర హీరోల జోడిగా వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది.

తెలుగులో అగ్ర హీరోల జోడిగా వరుస హిట్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక సినిమాల్లో కనిపించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించింది.

ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తుంది. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. ఇక నెట్టింట శ్రియా చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.




