- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Heroine, She Is Big Crush On Mahesh Babu, her Name Is Niharika NM
Actress : మహేష్ బాబు అంటే పిచ్చి.. పెళ్లి చేసుకోవాలనుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రతి అమ్మాయికి మహేష్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. తెలుగులోనే కాకుండా నార్త్ లోనూ ఈ హీరోకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఓ అమ్మడు చిన్నప్పుడే మహేష్ బాబును పెళ్లి చేసుకోవాలనుకుందట. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హీరోయిన్ గా మారింది.
Updated on: Sep 07, 2025 | 4:23 PM

సోషల్ మీడియా టు సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ గా మారి తమ కంటెంట్ తో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మడు సైతం అంతే.

నెట్టింట ఈ బ్యూటీ చాలా ఫేమస్. కరీనా కపూర్ ఖాన్ నుంచి మహేష్ బాబు, నాగచైతన్య, షాహిద్ కపూర్ వరకు ఎంతో మంది స్టార్స్ తో మూవీ ప్రమోషన్ వీడియోస్ చేసి మరింత ఫేమస్ అయ్యింది. ఇక ఇప్పుడు హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటుంది.

ఆ బ్యూటీ మరెవరో కాదండి.. సోషల్ మీడియా సెన్సేషన్.. హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్. అయితే ఈ ముద్దుగుమ్మకు మహేష్ బాబు అంటే పిచ్చి.. ఈ విషయాన్ని చాలా సందర్బాల్లో ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. మహేష్ బాబుతో తాను చేసిన రీల్ వీడియోను ఎంతో జాగ్రత్తగా పెట్టుకుందట.

గతంలో ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ.. తనకు ఐదేళ్లు ఉన్నప్పుడు మహేష్ బాబుు స్క్రీన్ పై చూశానని.. మురారి సినిమాలోనే మహేష్ బాబును మొదటిసారి చూశానని.. అప్పుడు అతడే తన మొగుడు అని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ.. తనకు ఐదేళ్లు ఉన్నప్పుడు మహేష్ బాబుు స్క్రీన్ పై చూశానని.. మురారి సినిమాలోనే మహేష్ బాబును మొదటిసారి చూశానని.. అప్పుడు అతడే తన మొగుడు అని ఫిక్స్ అయినట్లు చెప్పుకొచ్చింది. ఆమె కామెంట్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి.




