- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photo, She Is Sai Pallavi
Actress : అప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. బ్యూటీ ఎవరంటే..
ప్రస్తుతం సినీరంగంలో ఆమె తోపు హీరోయిన్. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే పాన్ ఇండియా ఇండస్ట్రీని ఏలేస్తుంది. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుస సినిమాలతో అలరిస్తుంది. డాక్టర్ కావాల్సిన ఈ అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ లో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె.
Updated on: Aug 13, 2025 | 9:47 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో జనాల హృదయాలు గెలుచుకుంది.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సంప్రదాయ లుక్ లో కనిపిస్తూనే సినిమా ప్రపంచాన్ని ఏలేస్తుంది. ఈ అమ్మడు నటనకు, వ్యక్తిత్వానికి కోట్లాది మంది జనాలు ఫిదా అయ్యారు. ఆమెకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువే. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటుంది.

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ సాయి పల్లవి. న్యాచురల్ బ్యూటీగా స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఫిదా సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఫస్ట్ మూవీతోనే కట్టిపడేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో జనాలకు దగ్గరయ్యింది.

తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించిన సాయి పల్లవి.. ప్రస్తుతం రామాయణ సినిమాతో హిందీలోకి తెరంగేట్రం చేసింది. 9 మే 1992న జన్మించిన సాయి పల్లవి.. నటన కంటే ముందు డాక్టర్ కావాలనుకుంది. కెరీర్ తొలినాళ్లల్లో రూ.2 కోట్ల ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ నిరాకరించింది.

ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు రామాయణ చిత్రంలో నటిస్తుంది. ఇందులో సీత పాత్రలో కనిపించనుంది. కెరీర్ మొదట్లో సైడ్ డ్యాన్సర్ గా కనిపించిన ఆమె.. ఇప్పుడు మాత్రం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.




