- Telugu News Photo Gallery Cinema photos Director K.S. Ravikumar interesting comments about Ramya Krishna
ఆ సీన్ చేయనని కన్నీళ్లు పెట్టుకున్న రమ్యకృష్ణ.. కానీ చివరకు చేయక తప్పలేదు
ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో ముందువరసలో ఉండే పేరు మాత్రం రమ్యకృష్ణ. స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడంటే సహాయక పాత్రలు చేస్తున్నారు కానీ.. అప్పటిలో రమ్యకృష్ణ టాలీవుడ్‌ను దున్నేశారు.
Updated on: Aug 14, 2025 | 1:27 PM

అప్పట్లో ఏ సినిమా చూసినా ఆమె హీరోయిన్ గా కనిపించేవారు. నటనతో పాటు తన గ్లామర్ తో అప్పటి కుర్రాళ్లను కిర్రెక్కించారు. రమ్యకృష్ణ తెలుగు, తమిళ్ కలిపి దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించారు. అలాగే ఆమె కేరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అప్పటి యూత్ రమ్యకృష్ణ అంటే పడి చచ్చిపోయేవారు.

కేవలం రమ్యకృష్ణను చూడటానికే సినిమాకు వెళ్లేవారు కూడా ఉన్నారు.ఇదిలా ఉంటే రమ్యకృష్ణ ఓ సినిమాలో ఓ సన్నివేశాని చేయడానికి అస్సలు ఒప్పుకోలేదట.. ఆ సీన్ చేయలేక కన్నీళ్లు కూడా పెట్టుకుందట.. అయినా సరే దర్శకుడు ఒప్పుకోలేదట.. చివరకు తప్పక ఆ సీన్ చేసిందట రమ్యకృష్ణ.

రమ్య కృష్ణ కెరీర్ లో బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా నరసింహ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. సినిమాలో ఓ సన్నివేశంలో నీలాంబరి తన పాదంతో సౌందర్య చెంపను తాకాల్సి ఉంటుంది. ఆ సీన్ చేయడానికి రమ్య చాలా ఇబ్బందిపడ్డారు. చేయను అని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారని తెలిపాడు రవికుమార్.

అయితే సౌందర్యే ముందుకు వచ్చి 'ఏం పర్వాలేదు' అని ధైర్యం చెప్పి.. రమ్యకృష్ణ కాలిని చెంప దగ్గర పెట్టుకున్నారని రవికుమార్ తెలిపారు. అలా ఆసీన్ ను పూర్తి చేశాం అని గుర్తు చేసుకున్నారు దర్శకుడు రవి కుమార్. ప్రస్తుతం రమ్యకృష్ణ పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు.