- Telugu News Photo Gallery Cinema photos Can You Guess The Actress In This Photo She Is Top Heroine Last 20 Years In South, Her Name Is Trisha Krishnan
Tollywood: 20 ఏళ్లుగా సౌత్ ఇండస్ట్రీని శాసిస్తున్న చిన్నది.. 42 ఏళ్ల వయసులో వరుస ఆఫర్స్..
సౌత్ సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్లలో ఆమె ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా సినిమా ప్రపంచంలో సత్తా చాటుతుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో తెలుసా.. ? ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
Updated on: Oct 03, 2025 | 6:51 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 42 ఏళ్ల వయసులో తెలుగు, తమిళంలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ పైన ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా.. ?

ఈ హీరోయిన్ మరెవరో కాదు.. త్రిష కృష్ణన్. ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఎన్నో మరుపురాని పాత్రలు పోషించింది. వర్షం, సైనికుడు, స్టాలిన్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యిది.

త్రిష తల్లిదండ్రులు పాలక్కాడ్‌లోని అయ్యర్ కుటుంబంలో పుట్టి పెరిగారు. త్రిష తండ్రి కృష్ణన్, తల్లి ఉమ్మ చాలా కాలం పాలక్కాడ్‌లోని కల్పతిలో నివసించారు. తరువాత, వారు చెన్నైకి వెళ్లారు.

డైరెక్టర్ ప్రియదర్శన్ మొదటగా త్రిషను వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. కానీ వీరిద్దరి కాంబోలో రావాల్సిన చిత్రం పలు కారణాలతో ఆగిపోయింది. తెలుగులో ప్రభాస్ సరసన చేసిన వర్షం మూవీ త్రిషకు బ్రేక్ ఇచ్చింది.

ఎన్నో సినిమాల్లో నటించిన త్రిష ఆ తర్వాత సైలెంట్ అయ్యింది. డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది.




