- Telugu News Photo Gallery Cinema photos Bhagyasri Steals the Spotlight Before Mr. Bachchan movie Release
Bhagyashri Borse: రిలీజ్ కి ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా భాగ్యశ్రీ బోర్సే
సినిమా ఇండస్ట్రీలో రెండు రకాల వ్యక్తులుంటారు. ఎన్నో ఏళ్లు కష్టపడ్డాక సక్సెస్ తెచ్చుకుని దాన్ని నిలబెట్టుకునేవారు. ఓవర్‌నైట్ వచ్చిన సక్సెస్‌ని హ్యాండిల్ చేసుకోలేక వదులుకునేవారు... మధ్యే మార్గంగా జాగ్రత్తగా డీల్ చేసుకునేవారు అరుదు... మరి మిస్టర్ బచ్చన్ భామ భాగ్యశ్రీ ఏ కోవలోకి చేరుతారు? ఉప్పెన సినిమా ప్రోమోల్లో కృతి శెట్టిని చూసినప్పుడే ఆమె సొట్ట బుగ్గల నవ్వుకు పడిపోయారు తెలుగు కుర్రాళ్లు.
Updated on: Aug 10, 2024 | 1:29 PM

మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా, భాగ్యశ్రీ నటకు మంచి మార్కులే పడ్డాయి. అయినా ఇప్పటిదాకా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద చడీచప్పుడూ వినిపించడం లేదు.

ఉప్పెన సినిమా ప్రోమోల్లో కృతి శెట్టిని చూసినప్పుడే ఆమె సొట్ట బుగ్గల నవ్వుకు పడిపోయారు తెలుగు కుర్రాళ్లు. వీడు ముసలాడైపోకూడదే అని ముద్దు ముద్దుగా ఆమె పలుకుతుంటే పది కాలాలపాటు టాలీవుడ్‌లో పచ్చగా ఉండమని దీవించేశారు.

బాలీవుడ్‌లో ఫస్ట్ వెంచర్ బావుండాలంటే కాస్త్ ప్రిపరేషన్ అవసరమని, టాలీవుడ్‌కి బ్రేక్ ఇచ్చారట శ్రీలీల. ఆ మధ్య విజయ్ మూవీ గోట్‌లో స్పెషల్ సాంగ్‌లో చేయమన్నారట శ్రీలీలను. రీసెంట్‌గా విశ్వంభర కోసం కూడా అడిగినట్టు వార్తలొచ్చాయి.

రవితేజ పక్కన స్టెప్పులేసిన శ్రీలీల జోరు చూసి టాలీవుడ్ హీరోలకు ఇంకేం ఫికర్ లేదు. అన్నీ ఏజ్ గ్రూపుల వాళ్లకి సరిపోయే నాయిక తెరంగేట్రం చేసేసింది అని అనుకున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో సడన్‌గా స్పీడ్ బ్రేకర్ అడ్డొచ్చింది శ్రీలీల కెరీర్‌లో.

ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలు సక్సెస్ అయితేనే శ్రీలీల కెరీర్‌కి కాసింత భరోసా దక్కేది... కృతి, శ్రీలీల లాగా ఫస్ట్ సినిమా రిలీజ్‌కి ముందే క్రేజ్ తెచ్చుకుంటున్నారు భాగ్యశ్రీ. మొదటి మూవీ మిస్టర్ బచ్చన్ రిలీజ్ కాకముందే వరుసగా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ఈ బ్యూటీ. ఈ జోరు కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడంలోనూ చూపిస్తారా? లేకుంటే తడబడతారా అని పరిశీలిస్తున్నారు మూవీ లవర్స్.




