- Telugu News Photo Gallery Cinema photos Naga Chaitanya and Sobhita Dhulipala Engagement Photos With Their Families
Naga Chaitanya – Sobhita Dhulipala: ఫ్యామిలీతో నాగచైతన్య, శోభితా.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ చూశారా..?
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం (ఆగస్ట్ 8న) వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటిస్తూ ఫోటోస్ షేర్ చేశారు.
Updated on: Aug 10, 2024 | 1:38 PM

అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం గురువారం (ఆగస్ట్ 8న) వేడుకగా జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటిస్తూ ఫోటోస్ షేర్ చేశారు.

ఇప్పుడు చైతన్య, శోభితా నిశ్చితార్థం ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇరువురి కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. నాగార్జున, అమల, అఖిల్ తోపాటు శోభిత కుటుంబ సభ్యులు ఇందులో ఉన్నారు.

చైతన్య, శోభితా నిశ్చితార్థం విషయంలో తమ కుటుంబం ఎంతో ఆనందంగా ఉందని నాగార్జున ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సమంతతో విడాకుల తర్వాత తన కొడుకు మానసికంగా ఎంతో బాధపడ్డారని.. తన దుఃఖాన్ని ఎవరితోనూ పంచుకోలేదని అన్నారు.

వీరిద్దరి వివాహానికి ఇంకా సమయం ఉందని అన్నారు. త్వరలోనే వీరిద్దరి పెళ్లి వేడుక తేదీలను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే.. 2017లో హీరోయిన్ సమంతను వివాహం చేసుకున్నారు నాగచైతన్య. కానీ 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

ప్రస్తుతం నాగచైతన్య తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అలాగే శోభితా హిందీలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. అటు వెబ్ సిరీస్ కూడా చేస్తుంది.

గత కొన్ని రోజులుగా చైతన్య, శోభితా రిలేషన్ షిప్ గురించి అనేక వార్తలు వినిపించాయి. అలాగే వీరిద్దరి కలిసి విదేశాలకు వెళ్లిన ఫోటోస్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా గురువారం నిశ్చితార్థం వేడుకతో తమ గురించి వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు.




