- Telugu News Photo gallery Cinema photos Balagam Movie Actress Kavya Kalyanram Says About Body Shaming comments in her career telugu cinema news
Kavya Kalyanram: ‘బలగం’ హీరోయిన్‌కు చేదు అనుభవం.. లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్..
బాలనటిగా కెరీర్ ఆరంభించి తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మసూధ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఇటీవలే బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ఉస్తాద్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో శ్రీసింహా హీరోగా నటిస్తున్నారు.
Updated on: Jul 12, 2023 | 6:35 PM

బాలనటిగా కెరీర్ ఆరంభించి తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్. ఇక ఇప్పుడు మసూధ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.

ఆ తర్వాత ఇటీవలే బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ఉస్తాద్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో శ్రీసింహా హీరోగా నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.

మొదట్లో ఓ సినిమా అడిషన్స్ కు వెళ్తే దర్శక నిర్మాతలు బాడీ షేమింగ్ చేశారని చెప్పుకొచ్చింది. మీరు చాలా లావుగా ఉన్నారు.. ఇలా ఉంటే అవకాశాలు రావు. సన్నగా అవ్వండి అంటూ హేళన చేశారని తెలిపింది.

అయితే వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తాను ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కావ్య చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ప్రస్తుతం కావ్య కళ్యాణ్ రామ్ నటించిన ఉస్తాద్ చిత్రం ఆగస్ట్ 12న అడియన్స్ ముందుకు రాబోతుంది.

బలగం హీరోయిన్‌కు చేదు అనుభవం.. లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్..

బలగం హీరోయిన్‌కు చేదు అనుభవం.. లావుగా ఉన్నావ్ అంటూ బాడీ షేమింగ్..





























