- Telugu News Photo Gallery Cinema photos Amaran movie releasing in Telugu theaters but KA movie not given theaters in Tamil Nadu
KA: తమిళ ఇండస్ట్రీలో తెలుగు సినిమాకు అన్యాయం
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయిన తెలుగు ప్రేక్షకులకు ఉన్నంత మంచితనం మరెక్కడా కనిపించదు.. అసలు మంచితనం ఏంటి ?? కనిపించడం ఏంటి అనుకుంటున్నారా ?? అయితే ఈ స్టోరీ చూడండి.. మనలో మనకి యెంత పోటీ ఉన్న తమిళ సినిమాలు విడుదల అంటే మనం థియేటర్స్ ఇస్తుంటాం. కానీ మన సినిమాలకు అక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. తాజాగా మరో సినిమా ఈ లిస్టులో చేరింది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Oct 29, 2024 | 9:25 PM

ఎవరు ఔనన్నా.. కాదన్నా తెలుగు ఆడియన్స్‌కు ఉన్నంత మంచితనం మరెక్కడా కనిపించదు. అవునా.. అంత మంచితనం ఎక్కడ కనిపించింది మీకు అనుకుంటున్నారు కదా..? కావాలంటే చూడండి.. ఎంత పోటీ ఉన్నా.. తమిళ సినిమాలకు థియేటర్స్ ఇస్తుంటాం. కానీ మన సినిమాలకు అక్కడ అన్యాయం జరుగుతూనే ఉంది. తాజాగా మరో సినిమా ఈ లిస్టులో చేరింది.

అమరన్ సినిమా దీపావళికి విడుదలవుతుంది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాను రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించారు. కమల్ హాసన్ నిర్మాత. ఈ సినిమాకు తెలుగులోనూ థియేటర్స్ బానే వస్తున్నారు. లక్కీ భాస్కర్, క లాంటి తెలుగు సినిమాలున్నా కూడా.. అమరన్ బిజినెస్ ప్రత్యేకమే.

తమిళంలో ఎలాగైతే భారీగా విడుదలవుతుందో.. తెలుగులోనూ అమరన్‌కు అంతే మంచి రిలీజ్ దక్కుతుంది. కానీ ఇక్కడ కిరణ్ అబ్బవరం క సినిమాకు ఇలా జరగట్లేదు. ఈయన సినిమాకు తమిళంలో థియేటర్స్ ఇవ్వలేదు. నామమాత్రపు రిలీజ్‌కు కూడా సరైన స్క్రీన్స్ దొరక్కపోవడంతో.. తమిళ రిలీజ్‌ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది.

ముందు నుంచి పాన్ ఇండియన్ సినిమాగానే ‘క’ ను ప్రమోట్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. కంటెంట్‌ను నమ్మి అన్ని భాషల్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ తెలుగులో మాత్రమే ఇది రిలీజ్ అయ్యేలా ఉందిప్పుడు. తమిళంలో థియేటర్స్ లేవు.. మలయాళంలో అదేరోజు దుల్కర్ సినిమా విడుదలవుతుంది. దాంతో తన రిలీజ్ ఆపేసారు కిరణ్.

క సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అందుకే ఆయనపై అభిమానంతో.. తన సినిమాను వాయిదా వేసుకున్నారు కిరణ్. మలయాళం అంటే ఓకే కానీ తమిళంలో మాత్రం కిరణ్ అబ్బవరం సినిమాకు అన్యాయమే జరిగింది. మనం తమిళ సినిమాలకు అన్ని థియేటర్స్ ఇస్తున్నపుడు.. మన సినిమాకు అక్కడెందుకు థియేటర్స్ ఇవ్వరనే వాదన మొదలైందిప్పుడు.





























