- Telugu News Photo Gallery Cinema photos Raashii Khanna movie promotion event photos goes viral in social media
Raashii Khanna: మూవీ ప్రమోషన్‌లో రాశీఖన్నా గ్లామర్ షో..
కెరీర్‌లో చాలా మందికి ఏదొక సమయంలో ఊహించని అద్భుతాలు జరుగుతుంటాయి.. కానీ ఒక హీరోయిన్ మాత్రం తన కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క అద్భుతం కూడా జరగలేదు అని భాధ పడుతుంది.. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు రాశీ ఖన్నా.. పాపం ఎన్ని సినిమాలు చేసినా.. ఈ భామకు లక్ మాత్రం కలిసి రావట్లేదు. తాను నమ్ముకున్న బాలీవుడ్ ఇమేజ్ తెచ్చిపెట్టిన టాలీవుడ్ తన కెరీర్ కు హెల్ప్ అవడం లేదని బాధ పడుతుంది.
Updated on: Oct 29, 2024 | 9:18 PM

అందరి కెరీర్‌లోనూ అద్భుతాలు జరుగుతున్నాయి.. ఒక్క నా కెరీర్‌లో తప్ప అనుకుంటున్నారు రాశీ ఖన్నా. పాపం ఎన్ని సినిమాలు చేసినా.. ఈ భామకు లక్ మాత్రం కలిసి రావట్లేదు. ఇమేజ్ తెచ్చిన టాలీవుడ్.. నమ్ముకున్న బాలీవుడ్ రెండూ రాశీ కెరీర్‌కు హెల్ప్ అవ్వట్లేదు. చివరి ప్రయత్నంగా మరో రెండు మూడు సినిమాలతో వచ్చేస్తున్నారు ఈ బ్యూటీ.

కొంతమంది హీరోయిన్లకి అందం ఉన్నా అదృష్టం ఉండదు. అందులో అందరికంటే ముందొచ్చే హీరోయిన్ రాశీ ఖన్నా. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ళైనా.. పాతిక సినిమాలకు పైగానే నటించినా.. క్రేజీ హీరోలతో జోడీ కట్టినా.. పాపం ఈ పాప లక్కు మాత్రం మారలేదు.

ఈమెతో పాటు వచ్చిన చాలా మంది టాప్ రేంజ్‌కు వెళ్లినా.. రాశీ మాత్రం మీడియం రేంజ్‌లోనే ఆగిపోయారు. ఏదో తమిళ, హిందీ సినిమాలతో లాక్కొస్తున్నారు కానీ తెలుగులో అయితే రాశీ ఖన్నా కెరీర్ ఎప్పుడో చరమాంకానికి చేరుకున్నట్లే కనిపిస్తుంది.

అప్పుడెప్పుడో కరోనా కంటే ముందొచ్చిన ప్రతిరోజు పండగేతో చివరి హిట్ కొట్టారు రాశీ. ఆ తర్వాత ఈమె నటించిన వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ సినిమాలు ఫ్లాపయ్యాయి. దాంతో ఈమెకు ఆఫర్స్ కరువయ్యాయి.

తెలుగులో ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నీరజ కోన తెరకెక్కిస్తున్న తెలుసు కదా..లో నటిస్తున్నారు రాశీ. ఇక హిందీలో గోధ్రా ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సబర్మతి రిపోర్ట్ సినిమాతో నవంబర్ 15న వస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో గ్లామర్ షో కురిపిస్తున్నారు రాశీ ఖన్నా. ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఈ బ్యూటీ.




