Pushpa: అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా ఉండబోతున్న క్లైమాక్స్
చూసేటోళ్లకి ఎట్టా ఉండాలో తెలుసునా... గూస్ బంప్స్ గూస్‌బంప్స్ అంటారే.. అవి వచ్చేయాల... పుష్పరాజ్ రూలింగ్ అంటే మామూలా... అందులోనూ క్లైమాక్స్ లో రూలింగ్ అంటే స్క్రీన్స్ చిరిగిపోవాలా... అంటున్నారు అల్లు ఆర్మీ. వారి ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా తెరకెక్కిస్తున్నారట సుకుమార్. ఉన్నట్టా? లేనట్టా? అనే అనుమానాలు ఇక అసలు అక్కర్లేదబ్బా.. పుష్పరాజ్ రావడం పక్కా. చెప్పిన టైమ్‌కి రావడానికే ఇప్పుడు రంగంలోకి దిగేశాడు పుష్పరాజ్.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Aug 06, 2024 | 9:53 PM

చూసేటోళ్లకి ఎట్టా ఉండాలో తెలుసునా... గూస్ బంప్స్ గూస్‌బంప్స్ అంటారే.. అవి వచ్చేయాల... పుష్పరాజ్ రూలింగ్ అంటే మామూలా... అందులోనూ క్లైమాక్స్ లో రూలింగ్ అంటే స్క్రీన్స్ చిరిగిపోవాలా... అంటున్నారు అల్లు ఆర్మీ. వారి ఎక్స్ పెక్టేషన్స్ ని డబుల్ చేసేలా తెరకెక్కిస్తున్నారట సుకుమార్.

ప్రస్తుతానికి నవంబర్లో ఒక్క సిద్దూ జొన్నలగడ్డ మాత్రమే రిలీజ్‌కు డేట్ లాక్ చేశారు. నవంబర్ 9న తెలుసు కదా మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. మరికొన్ని సినిమాలు ఈ సీజన్‌లో డేట్స్ లాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇక డిసెంబర్ 6న మోస్ట్ అవెయిటెడ్ పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం క్లైమాక్స్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఫారిన్ నుంచి వచ్చేసిన సుకు... ఇమీడియేట్‌గా ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ మీద ఫోకస్ చేశారు. ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా సెట్స్ లో జాయిన్ అయ్యారు.

ఈ సారి షెడ్యూల్ స్పెషల్ సాంగ్ చిత్రీకరణతో మొదలవుతుందని అందరూ అనుకున్నారు. కానీ యాక్షన్ సన్నివేశాలతో షురూ చేశారు సుకు మాస్టర్. ఆల్రెడీ రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ జనాల్లో మాంఛి ఊపు తీసుకొచ్చింది.

జస్ట్ ఊరించడం కాదు.. ఐకాన్ స్టార్ సినిమాకు పక్కా వెయ్యి కోట్ల బిజినెస్ రాసిపెట్టుకోండి అనే ధీమా కనిపిస్తోంది అల్లు అర్జున్ ఆర్మీలో.





























