- Telugu News Photo Gallery Cinema photos Anchor Sreemukhi Visits Tirumala Srivari Temple Through The Stairs For The First Time, Shares Photos
Anchor Sreemukhi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీముఖి.. ఫొటోలు షేర్ చేసిన స్టార్ యాంకర్
స్టార్ యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం తన సోదరుడు, యాంకర్ చైతూతో కలిసి తిరుమల వెళ్లిన ఆమె వీఐపీ దర్శనం ద్వారా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. అంతకు ముందు కాలినడకన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకుంది శ్రీముఖి.
Updated on: Aug 06, 2024 | 8:11 PM

స్టార్ యాంకర్ శ్రీముఖి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం తన సోదరుడు, యాంకర్ చైతూతో కలిసి తిరుమల వెళ్లిన ఆమె వీఐపీ దర్శనం ద్వారా స్వామివారికి మొక్కులు చెల్లించుకుంది. అంతకు ముందు కాలినడకన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకుంది శ్రీముఖి.

శ్రీవారి దర్శనం అనంతరం ఆమెకు ఆలయ అర్చకులు వారిక స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఇక ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి ఆలయ ఆవరణలో ఫోటోలు తీసుకుంది.

తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫోటోలను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది శ్రీముఖి. దీంతో అవికా స్తా నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి.

అంతకు ముందు తొలిసారి మెట్ల మార్గంలో కాలి నడకన తిరుమలకు చేరుకుంది శ్రీముఖి. ఈ ఫొటోలను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది బుల్లితెర రాములమ్మ.

'ఏడు కొండల వాడా.. వెంకట రమణ.. గోవిందా.. గోవిందా.. మొదటి సారి తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కాను' అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది శ్రీముఖి.

ఇక ఓవైపు వరుసగా టీవీ షోస్ చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోందీ శ్రీముఖి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.