Venkatesh: వెంకీ దారిలోనే సీనియర్ హీరోలంతా.. మరేంటి ఆ రూట్..

వెంకటేష్ పూర్తిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన గేమ్ చూసాక.. ఇదేదో బాగుందే అంటూ మిగిలిన సీనియర్ హీరోల మనసు కూడా అటువైపు వెళ్తుంది. సినిమాలు చేసినా థియేటర్స్‌కు ఆడియన్స్ వస్తారా రారా అనే డౌట్ ఉన్న ఈ సమయంలో.. తెలివైన నిర్ణయం తీసుకున్నారు వెంకటేష్. మరి ఆయనేం చేస్తున్నారు..? ఇంతకీ వెంకీ ఆడుతున్న సేఫ్ గేమ్ ఏంటి..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Jun 08, 2024 | 9:08 AM

సంక్రాంతికి వచ్చిన సైంధవ్ తర్వాత వెంకటేష్ నుంచి ఎలాంటి సౌండింగ్ లేదు.. నెక్ట్స్ ప్రాజెక్ట్ అనిల్ రావిపూడితో లాక్ అయినా దానిపై ఎలాంటి అప్‌డేట్ లేదు. కానీ సందడి లేకుండా మరో సంవత్సరానికి సరిపడా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకున్నారు వెంకీ. అందులో అనిల్ సినిమాతో పాటు రానా నాయుడు వెబ్ సిరీస్ కూడా ఉంది.

1 / 5
వెంకటేష్ ప్రస్తుతం సేఫ్ గేమ్ ఆడుతున్నారు. థియేటర్స్‌కు ఆడియన్స్ రాని ఈ నేపథ్యంలో తెలివైన నిర్ణయం తీసుకుంటున్నారు. సినిమాలు చేయట్లేదని ఎవరూ అనకుండా.. నచ్చిన దర్శకులతో అప్పుడప్పుడూ పని చేస్తున్నారు.

2 / 5
ఈ క్రమంలోనే తనకు ఎఫ్ 2, ఎఫ్ 3 లాంటి సినిమాలిచ్చిన అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చేస్తున్నారు. దీని షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది.

3 / 5
  సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు వెంకీ. ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసిన రానా నాయుడు సీజన్ 2 షూట్ ముంబైలో జరుగుతుంది. ఇది సెట్స్‌పై ఉండగానే సీజన్ 3 కూడా ప్రకటించారు మేకర్స్.

4 / 5
 ఈ లెక్కన సంక్రాంతి కంటే ముందే రానా నాయుడు సీజన్ 2 వెబ్ సిరీస్.. సంక్రాంతికి అనిల్ రావిపూడితో సినిమా.. సంక్రాంతి తర్వాత రానా నాయుడు సీజన్ 3తో ప్రేక్షకులకు ట్రీట్  ఇవ్వనున్నారు వెంకీ మామ.

5 / 5
Follow us