- Telugu News Photo Gallery Cinema photos After Animal movie, Bobby Deol may act in Balakrishna 109, Viswambhara and Kanguva movie
Bobby Deol: మోస్ట్ వాంటెడ్ గా మారిన బాబీ డియోల్.. డేట్స్ కోసం క్యూ కడుతున్న సౌత్ మేకర్స్
ఒక్క హిట్ బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ఇమేజ్‌నే మార్చేసింది. యానిమల్ సినిమాలో కొద్ది నిమిషాల పాటే కనిపించిన బాబీ, తన విలనిజంతో హోల్ ఇండియాను షేక్ చేశారు. దీంతో వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిర అవుతున్నారు ఈ సీనియర్ స్టార్. ముఖ్యంగా బాబీ డేట్స్ కోసం సౌత్ మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు,.యానిమల్ మూవీలో అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Phani CH
Updated on: Jan 31, 2024 | 8:50 PM

ఒక్క హిట్ బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్ ఇమేజ్‌నే మార్చేసింది. యానిమల్ సినిమాలో కొద్ది నిమిషాల పాటే కనిపించిన బాబీ, తన విలనిజంతో హోల్ ఇండియాను షేక్ చేశారు. దీంతో వరుస ఆఫర్లతో ఉక్కిరి బిక్కిర అవుతున్నారు ఈ సీనియర్ స్టార్. ముఖ్యంగా బాబీ డేట్స్ కోసం సౌత్ మేకర్స్ గట్టిగా ట్రై చేస్తున్నారు,.

యానిమల్ మూవీలో అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఇప్పుడు సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్‌గా మారిపోయారు. ఈ మూవీ రిలీజ్ కన్నా ముందే సౌత్ మేకర్స్‌తో టచ్‌లోకి వచ్చారు బాబీ. ఒకటి రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ఆఫ్టర్ యానిమల్ రిలీజ్ లెక్కలు మారిపోయాయి.

యానిమల్ రిలీజ్ కన్నా ముందే హరి హర వీరమల్లులో నటించేందుకు ఓకే చెప్పారు బాబీ డియోల్, కానీ ఆ సినిమా ఆగిపోయింది. తరువాత బాలయ్య 109వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది.

కోలీవుడ్‌లోనూ బాబీ జోరు కనిపిస్తోంది. తాజాగా కంగువ సినిమాలో బాబీ డియోల్ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్‌తోనే అబ్రార్ క్యారెక్టర్‌ను మించి క్రుయాలిటీ చూపించబోతున్నట్టుగా హింట్ ఇచ్చారు. తాజాగా బాబీ సౌత్ మూవీకి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.

చిరు విశ్వంభర సినిమాలోనూ బాబీ డియోల్‌ను విలన్‌గా చూపించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఆల్రెడీ రెండేళ్ల వరకు బాబీ డేట్స్ బిజీ అవ్వటంతో కాల్షీట్స్ అడ్జస్ట్ అయితే బాబీని తీసుకోవాలని, లేదంటే మరో స్టార్‌ను ట్రై చేయాలని ఫిక్స్ అయ్యారట. ఏది ఏమైనా సౌత్‌లో బాబీ డిమాండ్ చూస్తుంటే.. త్వరలో ఇక్కడే సెటిల్ అయినా ఆశ్చర్య పోనక్కర్లేదు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.





























