Nithiin: హిట్ డైరెక్టర్లను లైన్ లో పెట్టిన నితిన్.. నయా ఫార్ములా సక్సెస్ తెచ్చి పుడుతుందా ??
వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ నితిన్... అప్ కమింగ్ సినిమాల విషయంలో సేఫ్ గేమ్‌కు రెడీ అవుతున్నారు. ఇటీవల వరుస ప్రయోగాలతో ఇబ్బందుల్లో పడ్డ ఈ యంగ్ హీరో, నెక్ట్స్ చేయబోయే సినిమాల విషయంలో ప్లాన్ మార్చారు. మరి నయా ఫార్ములా నితిన్‌కు సక్సెస్ తెచ్చి పుడుతుందా.? వరుసగా మాచర్ల నియోజికవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో నిరాశపరిచిన నితిన్, అప్ కమింగ్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రయోగాల జోలికి వెల్లకుండా హిట్ ఫార్ములాను రిపీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.