- Telugu News Photo Gallery Cinema photos Kalki 2898 AD may have top stars Amitabh Bachchan, Kamal Haasan, Jr. NTR, Dulquer Salmaan
Kalki 2898 AD: కల్కి కోసం రంగంలోకి టాప్ స్టార్స్.. పేర్లు వింటుంటే గూజ్‌బంప్స్ వస్తున్నాయంటున్న ఫ్యాన్స్
అప్ కమింగ్ సినిమాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ మూవీ కల్కి 2898 ఏడీ. గతంలో ఇండియన్ స్క్రీన్ ఎప్పుడూ చూడని రేంజ్ మల్టీస్టారర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా సూపర్ స్టార ప్రభాస్‌తో పాటు నేషనల్ ఇమేజ్ ఉన్న చాలా మంది టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇది చాలాదన్నట్టుగా ఇప్పుడు గెస్ట్ రోల్స్ కోసం మరికొంత మందిని రంగంలోకి దించుతున్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీ.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Jan 31, 2024 | 8:10 PM

అప్ కమింగ్ సినిమాల్లో మోస్ట్ ఇంట్రస్టింగ్ మూవీ కల్కి 2898 ఏడీ. గతంలో ఇండియన్ స్క్రీన్ ఎప్పుడూ చూడని రేంజ్ మల్టీస్టారర్‌గా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా సూపర్ స్టార ప్రభాస్‌తో పాటు నేషనల్ ఇమేజ్ ఉన్న చాలా మంది టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇది చాలాదన్నట్టుగా ఇప్పుడు గెస్ట్ రోల్స్ కోసం మరికొంత మందిని రంగంలోకి దించుతున్నారు మేకర్స్.

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టాప్ హీరోయిన్ దీపిక పదుకోన్, గ్లామర్ క్వీన్ దిశా పాట్నీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వార్తలు ఫిలిం నగర్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో మరికొంత మంది టాప్ హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ పేర్లు వైరల్ అవుతున్నాయి.

దుల్కర్, విజయ్ విషయంలో క్లారిటీ రాకముందే మరో పేరు తెర మీదకు వచ్చింది. ఓ పౌరాణిక పాత్ర కోసం నేచురల్ స్టార్ నానిని సంప్రదించిందట కల్కి టీమ్. కృపాచార్యుడిగా నాని నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది లేటెస్ట్ టాక్. నాగీతో, వైజయంతి బ్యానర్‌తో మంచి రిలేషన్ ఉన్న నాని, కల్కిలో ఛాన్స్ వస్తే నిజంగానే నో చెప్పరంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

తాజాగా ఈ లిస్ట్‌లో ఎన్టీఆర్ పేరు కూడా వినిపిస్తోంది. ఓ పవర్ ఫుల్ గెస్ట్ రోల్‌ను తారక్‌తో చేయించాలన్న ఆలోచనలో ఉన్నారట దర్శకుడు నాగీ. అయితే తారక్ ఆ రోల్‌కు ఓకే చెప్పారా లేదా అన్న విషయంలో క్లారిటీ లేకపోయినా... కల్కి విషయంలో వినిపిస్తున్న తారల పేర్లు వింటుంటేనే గూజ్‌బంప్స్ వస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్.





























