- Telugu News Photo Gallery Cinema photos Actress Sara Ali Khan Wears Lehanga Her Beautifull Photos Goes Viral
Sara Ali Khan: లెహంగాలోనే మెరిసిన సైఫ్ డాటర్.. సారా అలీ ఖాన్ అందమైన ఫోటోస్..
బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. బీటౌన్ సైఫ్ అలీఖాన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సహజ నటనతో ప్రశంసలు అందుకుంది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ సినీరంగంలోకి అడుగుపెట్టింది.
Updated on: Jul 09, 2024 | 6:53 PM

బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో సారా అలీ ఖాన్ ఒకరు. బీటౌన్ సైఫ్ అలీఖాన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. సహజ నటనతో ప్రశంసలు అందుకుంది.

దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది సారా అలీ ఖాన్.

ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన ఆత్రంగి రే చిత్రంలో కనిపించింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ కీలకపాత్రలో నటించగా మంచి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని తమిళంలో గలాటా కళ్యాణం పేరుతో విడుదల చేశారు.

రొమాంటిక్ కామెడీ సారా పాచ్కేలో విక్కీ కౌశల్ సరసన సారా నటించింది. సినిమాతో పాటు పలు కమర్షియల్ చిత్రాల్లోనూ నటించిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.

తాజాగా కలర్ ఫుల్ లెహాంగాలో మరింత అందంగా కనిపించింది. పెళ్లి కూతురి లుక్ లో మెరిసిన సారా అలీ ఖాన్ స్టన్నింగ్ స్టిల్స్ ఇప్పుడు నెటిజన్స్ హృదయాలను దొచేస్తున్నాయి.




