Trisha: సక్సెస్‌ఫుల్ త్రిష.. ముందున్న సవాళ్లివే !!
త్రిష కృష్ణన్ పేరు ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ట్రెండింగ్‌లో ఉంది. 'ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటీమణి అందంగా ఉందంటే అందులో గొప్పేం లేదు. అదే ఇండస్ట్రీకి వచ్చిన 20 ఏళ్ల తర్వాత కూడా ఓ నటీమణి అందంగా ఉందంటే అది గొప్ప విషయమే. తప్పకుండా మనం అందరం మాట్లాడుకోవాల్సిన అంశమే' అంటూ త్రిష గురించి విజయ్ చెప్పిన మాటలు ఇప్పటికీ తమిళనాడులో వైరల్ అవుతూనే ఉన్నాయి.
Updated on: Jul 09, 2024 | 6:47 PM

త్రిష ఓటీటీలో డెబ్యూ ఇస్తున్న సీరీస్ బృంద. చెడు మీద మంచి చేసే యుద్ధంగా కనిపిస్తోంది బృంద. ఇందులో ఖాకీ డ్రస్‌లో పక్కా యాక్షన్ రోల్ చేశారు త్రిష. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చేసినప్పటికీ ఈ సీరీస్ మాత్రం తనకు చాలా స్పెషల్ అని అంటున్నారు ఈ చెన్నై సుందరి.

తప్పకుండా మనం అందరం మాట్లాడుకోవాల్సిన అంశమే' అంటూ త్రిష గురించి విజయ్ చెప్పిన మాటలు ఇప్పటికీ తమిళనాడులో వైరల్ అవుతూనే ఉన్నాయి. సెకండ్ ఇన్నింగ్స్ లో అంతలా ఛార్మ్ చూపిస్తున్నారు త్రిష. ఓ వైపు అందం, మరో వైపు అభినయంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు.

తెలుగు, తమిళ్, మలయాళం అనే తేడా లేకుండా వరుసగా ప్రాజెక్టులకు సైన్ చేస్తూ... సౌత్ క్వీన్ చాలా బిజీగా ఉన్నారని అనిపించుకుంటున్నారు. తమిళంలో ఇప్పుడు కమల్‌హాసన్ థగ్‌లైఫ్‌లో ఆమే నాయిక. అజిత్ విడాముయర్చిలోనూ ఆమే నాయిక. విజయ్ నెక్స్ట్ సినిమాలో త్రిష నటిస్తారనే టాక్ ఎలాగూ ఉంది.

మలయాళంలో రామ్, ఐడెంటిటీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇన్నిచోట్లా సాఫీగా సాగినా, ఓ రెండు చోట్ల మాత్రం ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్చువేషన్‌లో ఉన్నారు చెన్నై సుందరి. తెలుగులో స్టాలిన్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్నారు త్రిష కృష్ణన్. విశ్వంభర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సెవన్ ఏకర్స్ లో శరవేగంగా జరుగుతోంది. సీనియర్ హీరోయిన్లలో గోల్డెన్ స్టార్‌గా పేరు తెచ్చుకుంటున్న త్రిషకి ఇప్పుడు విశ్వంభర హిట్ అత్యవసరం.

అలాగే ఆమె నటిస్తున్న వెబ్ సీరీస్ బృంద. డ్రామా, మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ తరహా సబ్జెక్టుతో సాగుతుంది. బృందలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు త్రిష. చెడు మీద మంచి చేసే పోరాటంగా సాగింది టీజర్. గతంలో పలు సినిమాలతో ఓటీటీలో కనిపించిన చెన్నై సుందరి, ఇప్పుడు ఓటీటీలో డెబ్యూ సీరీస్‌తో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.




