- Telugu News Photo Gallery Cinema photos Actress Samantha Ruth Prabhu Focus On Youtube And Podcast in Online after cure from her health issues Telugu Heroines Photos
Samantha Ruth Prabhu: సమంత ఈజ్ బ్యాక్.! వరసగా క్యూ కట్టిన అవకాశాలు.
కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఖుషి రిలీజ్ టైమ్‌లో ఈ బ్యూటీ లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. అయితే ఈ గ్యాప్‌లో ఆడియన్స్‌తో టచ్‌లో ఉండేందుకు కొత్త దారిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. శాకుంతలం, ఖుషి సినిమాలను ప్యారలల్‌గా పూర్తి చేసిన సమంత, ఆ తరువాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ ఫిలిం నగర్‌లో వైరల్ అయ్యింది.
Updated on: Mar 17, 2024 | 7:22 PM

కొద్ది రోజులుగా సమంత సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఖుషి రిలీజ్ టైమ్‌లో ఈ బ్యూటీ లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారన్న ప్రచారం జరిగింది. ప్రజెంట్ సిచ్యుయేషన్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది.

అయితే ఈ గ్యాప్‌లో ఆడియన్స్‌తో టచ్‌లో ఉండేందుకు కొత్త దారిని సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ. శాకుంతలం, ఖుషి సినిమాలను ప్యారలల్‌గా పూర్తి చేసిన సమంత, ఆ తరువాత బ్రేక్ తీసుకుంటారన్న టాక్ ఫిలిం నగర్‌లో వైరల్ అయ్యింది.

అందుకు తగ్గట్టుగా సామ్ కొత్త సినిమాలేవి కమిట్ కాకపోవటంతో సమంత బ్రేక్ తీసుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్‌తో మాత్రంలో టచ్‌లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు సామ్.

ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు యూట్యూబ్‌లో పాడ్ కాస్ట్‌లు చేస్తున్నారు. ప్రజెంట్ స్టార్స్ చేసే పాడ్ కాస్ట్‌లకు ఆన్‌లైన్‌లో మంచి ఫేమ్ వస్తుండటంతో ఈ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సామ్.

తాజాగా తన తొలి పాడ్‌కాస్ట్ వీడియోను షేర్ చేశారు. స్టార్ హీరోయిన్ అయిన పాడ్ కాస్ట్ టాపిక్‌గా ఫిలిం ఇండస్ట్రీ సబ్జెక్ట్‌ను తీసుకోకుండా డిఫరెంట్ జానర్‌ను సెలెక్ట్ చేసుకున్నారు ఈ బ్యూటీ.

తొలి ప్రయత్నంలో తన లైఫ్‌ను టర్న్ చేసిన హెల్త్ ఇష్యూ గురించి డిస్కస్ చేశారు. అల్కేష్ అనే వ్యక్తితో కలిసి ఆటో ఇమ్యూనిటీ, మయోసైటిస్ లాంటి విషయాల మీద చర్చించారు.

ఇక నటన విషయానికి వస్తే... వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కాల్సిన ది బుల్ సినిమాలో సమంతను హీరోయిన్‌గా తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఆగిపోవటంతో సమంత నెక్ట్స్ మూవీ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.




