Ramya Pasupuleti: చిరంజీవి చెల్లెలిగా కొత్త హీరోయిన్.. విశ్వంభర సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రమ్య..
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విశ్వంభర. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాలో స్టిస్టర్ సెంటిమెంట్ కూడా ఉంటుందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ రూమర్స్ నిజమే అని క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ రమ్య పసుపులేటి. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న తెలుగమ్మాయి రమ్య పసుపులేటి కథానాయికగా ఆఫర్స్ అందుకుంటుంది.