- Telugu News Photo Gallery Cinema photos Actress Manushi Chhillar Joins Varun Tej Konidela's India's Biggest Air Force Action Movie telugu cinema news
Varun Tej: మెగా హీరో సరసన మాజీ మిస్ వరల్డ్.. వరుణ్ తేజ్ నెక్ట్స్ సినిమా హీరోయిన్ ఆమెనే..
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్స్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఆషికా రంగనాథ్, గౌరి కిషన్, అనిక సురేంద్రన్ తెరపై సందడి చేయగా.. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ అలరించనుంది.
Updated on: Mar 03, 2023 | 12:23 PM

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్స్ హవా కొనసాగుతుంది. ఇప్పటికే ఆషికా రంగనాథ్, గౌరి కిషన్, అనిక సురేంద్రన్ తెరపై సందడి చేయగా.. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ అలరించనుంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి గాండీవధారి అర్జున అనే టైటిల్ ఖరారు చేశారు.

యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రాబోతుంది. ఈ మూవీ కాకుండా వరుణ్ తేజ్ మరో భారీ బడ్జెట్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెలుగుతోపాటు హిందీలోనూ ఈ మూవీ రాబోతుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్లో రియల్ లైఫ్ ఇన్సిడెంట్లను బేస్ చేసుకుని ఈ సినిమాను తీసుకురానున్నారు. ఇందులో మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ను కథానాయికగా ఎంపిక చేసారు.

సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా అరంగేట్రం చేసింది. ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అనే మూవీ కూడా ఇప్పటికే కంప్లీట్ చేసింది. అలాగే తెరహాన్ అనే మరో సినిమాలో నటిస్తోంది.

ఇక ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. తెలుగులో మొట్టమొదటి `అంతరిక్షం బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మూవీలో కూడా వరుణ్ తేజ్ హీరోగా నటించడం విశేషం.

మెగా హీరో సరసన మాజీ మిస్ వరల్డ్.. వరుణ్ తేజ్ నెక్ట్స్ సినిమా హీరోయిన్ ఆమెనే..

మెగా హీరో సరసన మాజీ మిస్ వరల్డ్.. వరుణ్ తేజ్ నెక్ట్స్ సినిమా హీరోయిన్ ఆమెనే..





























