- Telugu News Photo Gallery Cinema photos Actress hansika motwani shared her latest stunning photos, goes viral
బంగారు చేపల మెరిసిన యాపిల్ బ్యూటీ.. మెస్మరైజ్ చేసిన హన్సిక
దేశముదురు తరువాత, నటి హన్సిక మోత్వానీ 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మాప్పిళ్ళై' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్ తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక. హన్సిక తెలుగు, తమిళ్ తో కన్నడలోనూ ఒక సినిమా చేసింది హన్సిక.
Updated on: Mar 03, 2025 | 10:55 PM

యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2007లో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

దేశముదురు తరువాత, నటి హన్సిక మోత్వానీ 2011 సంవత్సరంలో సూరజ్ దర్శకత్వం వహించిన మాప్పిళ్ళై' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.

తెలుగులో ఎన్టీఆర్, రామ్ పోతినేని, ప్రభాస్ తో బిల్లా, రవితేజతో పవర్ సినిమాలు చేసింది హన్సిక. హన్సిక తెలుగు, తమిళ్ తో కన్నడలోనూ ఒక సినిమా చేసింది హన్సిక. ఇక తమిళ్ లో జయం రవితో ఎంగేయుమ్ కాదల్, నటుడు విజయ్‌తో వేలాయుతం, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో ఒరు కల్ ఒరు గీమ్, రోమియో అండ్ జూలియట్ వంటి అనేక విజయవంతమైన చిత్రాలలో ఆమె నటించింది.

నటి హన్సికను తమిళ చిత్ర పరిశ్రమ అభిమానులు కుట్టి కుష్బూ అని పిలుస్తారు. నటి హన్సిక మోత్వానీ అతి తక్కువ సమయంలోనే ప్రముఖ నటీమణుల జాబితాలోకి ప్రవేశించింది. ఆ తర్వాత గతేడాది 2020 తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం వెబ్ సీరియల్స్, సినిమాల్లో నటిస్తుంది.

డిసెంబర్ 2023 లో, హన్సిక తన ప్రియుడు సోహైల్ ఖతురియాను వివాహం చేసుకుంది. ప్రస్తుతం హన్సిక గాంధారి చిత్రంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే టీవీ షోలోనూ జడ్జ్ గా చేస్తుంది .




