- Telugu News Photo Gallery Cinema photos Actress Catherine Tresa Will Act in Megastar Chiranjeevi and Director Anil Ravipudi Movie
Megastar Chiranjeevi: చిరంజీవి జోడిగా టాలీవుడ్ ఎమ్మెల్యే.. అనిల్ రావిపూడి సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్..
మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చివరిసారిగా వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్టుకొట్టిన చిరు.. ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ మూవీకి సంబంధించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Updated on: May 06, 2025 | 2:31 PM

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఈ మూవీకి సంబంధించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ వర్గాల్లో వైరలవుతుంది.

చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్స్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదితి రావు హైదరీ, పరిణీతి చోప్రాలను తీసుకున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరికొందరి పేర్లు తెరపైకి రాగా.. ఇప్పుడు కేథరిన్ పేరు వినిపిస్తుంది.

అయితే కేథరిన్ ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ కాకుండా సెకండ్ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీలో ఆమె పాత్ర చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు నయనతారను తీసుకున్నారట.

ఇక ఈ సినిమాకు నయనతారకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట నయన్. తెలుగులో చాలాకాలంగా సినిమాలు చేస్తుంది కేథరిన్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది.

ఇక ఈ సినిమాకు నయనతారకు భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట నయన్. తెలుగులో చాలాకాలంగా సినిమాలు చేస్తుంది కేథరిన్. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది.




