- Telugu News Photo Gallery Cinema photos Anchor Lasya Manjunath Shining Looks In Blue Saree, See Photos
Anchor Lasya: నీలి రంగు చీరలోన.. ట్రెడిషినల్ శారీలో మెరిసిపోయిన యాంకర్ లాస్య.. బ్యూటిఫుల్ ఫొటోస్ ఇదిగో
ఒకప్పుడు టాలీవుడ్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది లాస్య. అయితే ఇప్పుడు పెద్దగా టీవీ షోస్ లలో కనిపించడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే బుల్లితెరపై సందడి చేస్తుంటుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల యాంకరమ్మ.
Updated on: May 06, 2025 | 12:42 PM

ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటోన్న యాంకర్ లాస్య తన పేరుతో సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తోంది. అందులో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను షేర్ చేసుకుంటుంది.

ముఖ్యంగా ఈ మధ్యన ఆధ్యాత్మిక యాత్రల్లో బిజి బిజీగా ఉంటోందీ యాంకరమ్మ. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

మహా కుంభమేళా తర్వాత వారణాసి, కాశీ, అయోధ్య, అరుణాచలం.. ఇలా అన్ని పుణ్య క్షేత్రాలను తిరిగేసిన లాస్య ఆ ఫొటోలు, వీడియోలను నెట్టింట షేర్ చేసింది. అవి నెట్టింట వైరలయ్యాయి

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది లాస్య. అందులో నీలి రంగు చీరలో ఎంతో ట్రెడిషినల్ గా కనిపించిందీ అందాల తార.

ప్రస్తుతం యాంకర్ లాస్య మంజునాథ్ ఫొటోలు నెట్టింట వైరలవుతన్నాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

లాస్య, మంజునాథ లది ప్రేమ వివాహం. 2017లో వీరి వివాహం పెద్దల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.




