- Telugu News Photo Gallery Cinema photos Actor Vijay Sethupathi Dropped From Bollywood Ramayan Movie For This Reason Telugu Heroes Photos
Vijay Sethupathi: విజయ్ సేతుపతి తొందరపడ్డారా.? ఆ మూవీ నుండి అవుట్.
ఉత్తరాది రామాయణంలో విజయ్ సేతుపతి చేయడం లేదు... ఇప్పుడు ముంబై సర్కిల్స్ లో ఇదే ఇంట్రస్టింగ్ టాపిక్. హీరోగా తప్ప, కేరక్టర్ ఆర్టిస్టుగా చేయకూడదనుకున్నారు విజయ్ సేతుపతి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లాభనష్టాలేంటని బేరీజు వేసుకుంటోంది సేతుపతి సైన్యం. మరి ఆయన మనసులో ఏముంది.? జవాన్ సినిమా సూపర్‌డూపర్ సక్సెస్ అయిన తర్వాత నార్త్ లో, ఇక విలన్ రోల్ అంటే విజయ్ సేతుపతి గుర్తుకొస్తారని అనుకున్నారు అందరూ.
Updated on: Mar 12, 2024 | 10:42 PM

ఉత్తరాది రామాయణంలో విజయ్ సేతుపతి చేయడం లేదు... ఇప్పుడు ముంబై సర్కిల్స్ లో ఇదే ఇంట్రస్టింగ్ టాపిక్. హీరోగా తప్ప, కేరక్టర్ ఆర్టిస్టుగా చేయకూడదనుకున్నారు విజయ్ సేతుపతి. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల లాభనష్టాలేంటని బేరీజు వేసుకుంటోంది సేతుపతి సైన్యం.

మరి ఆయన మనసులో ఏముంది.? జవాన్ సినిమా సూపర్‌డూపర్ సక్సెస్ అయిన తర్వాత నార్త్ లో, ఇక విలన్ రోల్ అంటే విజయ్ సేతుపతి గుర్తుకొస్తారని అనుకున్నారు అందరూ.

అయితే, అలాంటి ఊహలను ఎంకరేజ్ చేయలేదు విజయ్ సేతుపతి. నేను చేయాలనుకున్న విలన్ రోల్స్ చేసేశాను. హీరోగా సినిమాలు చేయాలనుకుంటున్నాను.

మంచి స్క్రిప్టులు సెలక్ట్ చేసుకోవాలంటే కథలు వినాలి. అందుకు కాస్త సమయం కావాలి.. అందుకే ఇప్పుడు కేరక్టర్ల కోసం నన్ను సంప్రదించకండి అని ఓపెన్‌గా చెప్పారు.

ఉప్పెన, మాస్టర్, విక్రమ్.. సినిమా ఏదైనా, విలన్ రోల్‌లో సేతుపతి ఉంటే, స్క్రీన్ మీద వైబ్రేషన్స్ ఇంకో రేంజ్‌లో ఉంటాయన్న పేరు తెచ్చుకున్నారు. అందుకే బాలీవుడ్‌లో రామాయణం ప్రస్తావన వచ్చినప్పుడు విభీషణుడి కేరక్టర్‌కి విజయ్ సేతుపతి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని అంతా భావించారు.

కానీ మక్కల్ సెల్వన్ డెసిషన్ విన్న తర్వాత రామాయణం టీమ్ మనసు మార్చుకుందట. విభీషణుడి రోల్ కోసం హర్మాన్ బవేజాను సెలక్ట్ చేసుకున్నారట.

దీని గురించి తెలిసిన నార్త్ ఆడియన్స్ మాత్రం ఫర్జి యాక్టర్ , ఇలా ఎందుకు డెసిషన్ తీసుకున్నారబ్బా... అంటూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.




