- Telugu News Photo Gallery Cinema photos Actress Mamitha Baiju clarity on her entry in Tollywood details here Telugu Actress Photos
Mamitha Baiju: కీర్తి , అనుపమ బాటలోనే మరో మలయాళ కుట్టీ మమిత బైజూ
హీరోయిన్స్ అంటే కేరాఫ్ కేరళ అనే బ్రాండ్ ఎక్కువగా ఉంటుంది మన ఇండస్ట్రీలో. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. కన్నడ, తమిళం నుంచి కూడా హీరోయిన్లు వస్తున్నా.. మలయాళం బ్యూటీస్‌కు ఉండే డిమాండే వేరు. తాజాగా మరో కేరళ కుట్టి గురించి టాలీవుడ్‌లో డిస్కషన్స్ మొదలయ్యాయి. మరింతకీ ఎవరా మలయాళ బ్యూటీ..? టాలీవుడ్‌లో మలయాళ హీరోయిన్లకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది.
Updated on: Mar 12, 2024 | 10:42 PM

హీరోయిన్స్ అంటే కేరాఫ్ కేరళ అనే బ్రాండ్ ఎక్కువగా ఉంటుంది మన ఇండస్ట్రీలో. ఇప్పుడు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. కన్నడ, తమిళం నుంచి కూడా హీరోయిన్లు వస్తున్నా.. మలయాళం బ్యూటీస్‌కు ఉండే డిమాండే వేరు.

తాజాగా మరో కేరళ కుట్టి గురించి టాలీవుడ్‌లో డిస్కషన్స్ మొదలయ్యాయి. మరింతకీ ఎవరా మలయాళ బ్యూటీ..? టాలీవుడ్‌లో మలయాళ హీరోయిన్లకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది.

వెళ్లెప్పుడు వచ్చినా రెడ్ కార్పెట్ వేయడానికి రెడీగా ఉంటారు మన నిర్మాతలు. ఈ మధ్య కేరళ కుట్టీస్ దూకుడు కాస్త తగ్గింది కానీ ఉన్నంతలో ఇప్పటికీ వాళ్ల హవానే కనిపిస్తుంది.

కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ లాంటి బ్యూటీస్ వరస ఆఫర్స్ అందుకుంటూనే ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తాజాగా మరో కేరళ కుట్టి గురించి చర్చ మొదలైంది. ఆ భామ ఎవరో కాదు.. ప్రేమలు ఫేమ్ మమితా బైజూ.

ప్రేమలు సినిమా చూసిన వాళ్లకు ఈ బ్యూటీ నటన గురించి పరిచయాలు అవసరం లేదు. కళ్లతో మాయ చేసారు మమిత. తెలుగులోనూ ప్రేమలు ఇంతగా కనెక్ట్ అవ్వడానికి మమిత కూడా ప్రధాన కారణం.

ప్రేమలు విజయంతో మమిత బైజూ కేవలం మలయాళంలోనే కాదు.. సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. తమిళంలో ఇప్పటికే విష్ణు విశాల్ సినిమాకు సైన్ చేసిన మమిత.. టాలీవుడ్ పిలుపు కోసం వేచి చూస్తున్నారు.

ఆ రోజు కూడా దగ్గర్లోనే ఉందనిపిస్తుంది. మొత్తానికి ఇంతమంది మలయాళ కుట్టీస్ ఉండగానే.. మరో బ్యూటీ దండయాత్రకు సిద్ధమవుతున్నారన్నమాట.




