- Telugu News Photo Gallery Cinema photos A sequel is getting ready for the movie Sardar starring Kollywood star Karthi
Sardar 2: సీక్వెల్‌గా రానున్న సర్దార్.. దినిపై తాజా అప్‌డేట్..
కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన సర్దార్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. కార్తి డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది అందుకే ఇప్పుడు సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సర్దార్ సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో కార్తి... మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Updated on: Dec 25, 2023 | 1:43 PM

కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా తెరకెక్కిన సర్దార్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. కార్తి డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించింది అందుకే ఇప్పుడు సీక్వెల్‌ను మరింత భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

సర్దార్ సినిమాతో వంద కోట్లు కొల్లగొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో కార్తి... మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సర్దార్ క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందన్న హింట్ ఇచ్చిన మేకర్స్... షార్ట్ గ్యాప్‌లోనే పార్ట్ 2ను పట్టాలెక్కిస్తున్నారు.

తాజాగా సీక్వెల్‌కు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి చెన్నై సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఫస్ట్ పార్ట్‌లో కార్తి డ్యూయల్ రోల్‌లో కనిపించి ఆకట్టుకన్నారు. సీక్వెల్‌కు మరింత స్టార్ ఇమేజ్ యాడ్ చేస్తూ మరో స్టార్ హీరోను రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు.

ప్రజెంట్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా ఉన్న విజయ్ సేతుపతి, సర్దార్ 2లో కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ అప్‌డేట్‌తో సర్థార్ 2 మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి.

తొలి భాగంలో ఫాదర్ క్యారెక్టర్ మాత్రమే స్పైగా కనిపిస్తే.. సీక్వెల్‌లో కొడుకు క్యారెక్టర్ కూడా గూఢచారిగానే కనిపిస్తుందన్నది నయా అప్‌డేట్. ఈ న్యూస్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. మరి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యేందుకు మేకర్స్ ఎలాంటి ప్లాన్ రెడీ చేస్తారో చూడాలి.




