- Telugu News Photo Gallery Cinema photos Yash KGF to Ram Gopal Varma Sorry latest film updates from cinema industry
Movie News: రాకీభాయ్‌ని గుర్తు చేసుకున్న కేజీఎఫ్ ఫ్యాన్స్.. ఆర్జీవీ కొత్త సినిమా..
యాత్ర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహి వీ రాఘవ ఈ సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. సాండల్‌వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఊరుపేరు భైరవకోన. ద్ది రోజులుగా ఓ అమ్మాయి వీడియోలను తరచు తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ. సూపర్ హిట్ కామెడీ సిరీస్ వెల్‌కం ఫ్రాంచైజీలో మూడో సినిమా తెరకెక్కుతోంది.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Dec 25, 2023 | 1:27 PM

యాత్ర సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మహి వీ రాఘవ ఈ సినిమాకు సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో 2009 నుంచి 2019 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా యాత్ర2 సినిమాను రూపొందించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు.

సాండల్‌వుడ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్. ఈ సినిమా రిలీజ్ అయిన ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రాకీభాయ్‌ని గుర్తు చేసుకున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ డిసెంబర్ 22న విడుదలై బ్లాక్ బస్టర్ అయింది.

సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఊరుపేరు భైరవకోన. చాలా రోజులుగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్న ఈ మూవీ టీమ్, ఫైనల్‌గా విడుదల తేదిని ఎనౌన్స్ చేసింది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ష బొల్లమా, కావ్యథాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

కొద్ది రోజులుగా ఓ అమ్మాయి వీడియోలను తరచు తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ. ఆమెను వెండితెరకు పరిచయం చేయబోతున్నారు. ఇంటర్నేషనల్ సారీ డే సందర్భంగా సారీ పేరుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నట్టుగా ఎనౌన్స్ చేశారు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

సూపర్ హిట్ కామెడీ సిరీస్ వెల్‌కం ఫ్రాంచైజీలో మూడో సినిమా తెరకెక్కుతోంది. వెల్‌కం టు ద జంగల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు హీరో అక్షయ్‌కుమార్. వెల్‌కం సిరీస్ ప్రారంభమై 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ట్వీట్ చేసిన అక్షయ్, త్రీక్వెల్‌లో సంజయ్ దత్‌తో కలిసి నటించటం మరింత ఆనందంగా ఉందన్నారు.





























