Telugu Movies: సలార్‌పై ఉత్తరాదిన కుట్ర..! ఆ రోజున దేవర అప్‌డేట్..

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల అయింది. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర.  రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఈ మధ్యే ఓ పాప పుట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ క్రిటిక్స్‌పై యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సీనియర్ గాయని సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా సర్కారు నౌకరి.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Dec 25, 2023 | 12:55 PM

ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న విడుదల అయింది. భారీ అంచల మధ్య విడుదలైన మొదటి భాగం సీజ్ ఫైర్‌ బ్లాక్ బస్టర్ అయింది. ఇదిలా ఉంటే ఉత్తరాదిన PVR, INOX, మిరాజ్ థియేటర్స్ సలార్‌కి ఇవ్వకుండా డంకీకి ఇచ్చారు. దాంతో అక్కడ తమ సినిమాకు థియేటర్స్‌ ఇచ్చేవరకు దక్షిణాదిన సలార్ మీకు ఇవ్వమంటూ సదరు థియేటర్స్‌కు షాక్ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

1 / 5
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా దేవర. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు అభిమానులు. వాళ్ల కోసమే తీపికబురు చెప్పేలా ఉన్నారు మేకర్స్. జనవరి 1న కొత్త ఏడాది కానుకగా కారెక్టర్స్ పరిచయం చేసేలా ఓ థీమ్ వీడియో ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

2 / 5
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఈ మధ్యే ఓ పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ పాపకు ‘క్లింకారా’ అనే నామకరణం కూడా చేసారు. పాప పుట్టి ఆరునెలలు పూర్తైన నేపథ్యంలో చరణ్‌ దంపతులు తమ కుమార్తెతో కలిసి ముంబై లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. గత నాలుగు రోజులుగా చరణ్‌ తన కుటుంబంతో పాటు ముంబైలోనే ఉంటున్నారు.

3 / 5
Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

4 / 5
సీనియర్ గాయని సునీత కుమారుడు ఆకాశ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా సర్కారు నౌకరి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకు నిర్మాత. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో సర్కారు నౌకరి సినిమా వస్తుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న విడుదల కానుంది సర్కారు నౌకరి సినిమా.

5 / 5
Follow us