- Telugu News Photo Gallery Chicken Vs Paneer Vs Eggs: Which is the Best Protein Source For Health, You Need To Know
పనీర్ Vs గుడ్లు Vs చికెన్.. ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
Chicken Vs Paneer Vs Eggs: శారీరక అభివృద్ధి, కండరాల పెరుగుదల, రికవరీకి ప్రోటీన్ అత్యంత ముఖ్యమైన పోషకాల్లో ఒకటి. మన దైనందిన అవసరాలను తీర్చడానికి చాలా మంది చికెన్, గుడ్లు, పనీర్ వంటి ఆహారాలను తింటుంటారు. అయితే ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలనే విషయంలో చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఈ మూడు ఆహార పోషక విలువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 26, 2025 | 7:15 AM

చికెన్ - ప్రోటీన్: చికెన్ విషయానికి వస్తే చికెన్ ప్రోటీన్‌కు బెస్ట్. 100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో దాదాపు 165 కేలరీలు ఉంటాయి. అద్భుతమైన 31-32 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది కాకుండా, ఇందులో కొవ్వు కేవలం 3.5 గ్రాములు మాత్రమే ఉంటుంది. కార్బోహైడ్రేట్లు అస్సలు ఉండవు. మాంసాహారులకు, కండరాలను వేగంగా పెంచుకోవాలనుకునే వారికి, అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వు కోరుకునే వారికి ఇది చాలా మంచిది.

పన్నీర్ : మీరు 100 గ్రాముల పన్నీర్ తీసుకుంటే, అందులో 265 నుండి 300 కేలరీలు ఉంటాయి. ప్రోటీన్ చూసుకుంటే ఇందులో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అయితే ఇందులో కొవ్వు కొంచెం ఎక్కువగా ఉంటుంది. పన్నీర్‌లో నెమ్మదిగా జీర్ణమయ్యే ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో స్లోగా విడుదల అవుతుంది. దీని వల్ల కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది. శాకాహారులకు, బరువు తగ్గాలనుకునే వారికి, ఎక్కువసేపు శక్తి కావాలనుకునే వారికి పన్నీర్ సహాయపడుతుంది. ఇందులో కాల్షియం కూడా ఉంటుంది.

గుడ్లు : జిమ్‌కి వెళ్లే చాలా మంది ప్రోటీన్ కోసం గుడ్లను తింటారు. దీనికి అతిపెద్ద కారణం గుడ్లలో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉండటం. నిపుణులు దీనిని బంగారు ప్రమాణ ప్రోటీన్ అని పిలుస్తారు. పోషకాహారాన్ని పరిగణలోకి తీసుకుంటే 2 పెద్ద గుడ్లు దాదాపు 155 కేలరీలు కలిగి ఉంటాయి. ఇందులో13 గ్రాముల ప్రోటీన్, 1.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.

గుడ్లలోని అధిక నాణ్యత గల ప్రోటీన్‌ను శరీరం చాలా తేలికగా, బాగా ఉపయోగించుకుంటుంది..ఇందులో విటమిన్ డి, విటమిన్ బి-12 వంటి ఆరోగ్యకరమైన విటమిన్లు కూడా ఉన్నాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇది చాలా మంచిది. కండరాలు రికవరీ అవ్వడానికి మరియు మంచి పోషణకు గుడ్లు తినడం ఉత్తమం.

ఏది బెస్ట్ : నిజానికి, ప్రోటీన్ కోసం ఈ మూడూ మంచివే. ఈ మూడింటిలో ఏది ఉత్తమమైనది అనేది మీ వ్యక్తిగత లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది. మీరు శాఖాహారులైతే, కడుపు నిండుగా ఉండి శక్తిని పొందాలనుకుంటే, పన్నీర్ మీకు బెస్ట్ ఆప్షన్. అధిక నాణ్యత గల ప్రోటీన్ సహా సమగ్ర పోషణ కోసం పిల్లల నుండి జిమ్‌కి వెళ్లేవారు, వృద్ధుల వరకు అందరికీ గుడ్లు మంచి ఎంపిక. మీరు మాంసాహారులైతే అత్యధిక ప్రోటీన్ కోరుకుంటే చికెన్ మీకు ఉత్తమమైనది. మీరు మీ డైట్ ప్లాన్‌ను బట్టి ఈ మూడింటినీ మార్చుకుంటూ తింటే ఇంకా మంచిది.




