- Telugu News Photo Gallery Carrot And Beetroot Juice: Does carrot and beetroot juice cause weight gain? Know here
Carrot And Beetroot Juice: క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగితే బరువు పెరుగుతారా? దీనిలో నిజమెంత..
క్యారెట్, బీట్‌రూట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్‌లలో ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బీట్‌రూట్‌లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయినా వీటిని నేరుగా తినడం వల్లనే అధిక ప్రయోజనాలు అందుతాయి. జ్యూస్ రూపంలో తీసుకుంటే..
Updated on: Jan 30, 2025 | 12:52 PM

మన ఆహార అలవాట్లే మన బరువును నిర్ణయిస్తాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్య క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగితే బరువు వేగంగా పెరుగుతారనే సందేహం కొందరిలో ఉంటుంది. ఇందులో నిజమెంతో నిపుణుల మాటల్లో తెలుసుకుందాం..

క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్‌లలో సహజంగా కేలగరీలు అధికంగా ఉంటాయి. కానీ మీ మిగిలిన ఆహారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం కేలరీలు పెరుగుతాయి. దీంతో బరువు పెరగడం ఖాయం. ఎందుకంటే జ్యూస్ రూపంలో తీసుకుంటే వీటిల్లోని పీచు పదార్ధం మాయం అవుతుంది.

క్యారెట్, బీట్‌రూట్‌లో పోషక కణాలు ఉంటాయి. క్యారెట్‌లలో ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది. మరోవైపు, బీట్‌రూట్‌లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సితో పాటు ఫోలేట్ అధికంగా ఉంటుంది. రెండు కూరగాయలు తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. అయితే వీటిని జ్యూస్‌గా కన్నా నేరుగా తీసుకోవడం మంచిది.

క్యారెట్, బీట్‌రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం కడుపు నిండుగా ఉంటుంది. అతిగా తినకుండా ఉంటారు. బరువు తగ్గడానికి ఇది మంచిది. అయితే క్యారెట్, బీట్‌రూట్‌లను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఫైబర్ కంటెంట్ గణనీయంగా తగ్గుతుంది.

అలాగే దాని చక్కెర కంటెంట్ పెరుగుతుంది. ఈ రెండింటిలో సహజ చక్కెరలు ఉంటాయి. దీంతో ఈ జ్యూస్ ఎక్కువగా తాగితే బరువు పెరగడానికి కారణం అవుతుంది. అందుకే జ్యూస్ పరిమిత మోతాదులో తీసుకోవాలి.




