AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elaichi Benefits: ప్రతిరోజు భోజనం తర్వాత యాలకులు తింటున్నారా..? ఏమౌతుందో తెలిస్తే..

యాలకులు వీటినే ఇలాంచీలు అని కూడా అంటారు. ఇవి వంటకాలకు మంచి సువాసన, రుచినిచ్చే మసాలా దినుసులు. అంతేకాదు..యాలకుల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఓ ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కొద్ది మొతాదులో యాలకులు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. భోజనం తరువాత యాలకులు తీసుకోవటం వల్ల శరీరంలో ఊహించని మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. అవేంటంటే..

Jyothi Gadda
|

Updated on: Jul 28, 2025 | 9:32 AM

Share
భోజనం తర్వాత యాలకులు తినటం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు తెలిపారు. యాలకులు తినటం వల్ల అజీర్తి, ఉబ్బరం, గ్యాస్ తగ్గుతాయి. యాలకులలో ఉండే ముఖ్యమైన నూనెలు అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

1 / 5
సహజంగా నోటిని శుభ్రపరుస్తాయి. యాలకులు నమలడం వల్ల నోట్లో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించి, దుర్వాసనను తగ్గిస్తుంది. శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపి, మూత్ర పిండాల పనితీరును మెరుగుపరుస్తాయి. యాలకులు రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

2 / 5
శ్వాసను తాజాగా, నోటిని ఆరోగ్యంగా ఉంచుతుంది: భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల శ్వాస తాజాగా ఉంటుంది. యాలకులలో ఉండే యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలు నోటి బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి. యాలకులలో ఉండే నూనెలు చిగుళ్ల వ్యాధి, కావిటీస్‌తో సంబంధం ఉన్న బ్యాక్టీరియాను తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీని కోసం, భోజనం తర్వాత ఒక యాలక్కాయ నోటిలో వేసుకుని నమలండి.

3 / 5
యాలకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. యాలకులు మెదడుకు రక్త ప్రసరణను పెంచి, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్​ను నివారించడంలో కూడా యాలకులు సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. యాలకులలో ఉన్న యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

4 / 5
రాత్రి భోజనం తర్వాత యాలకులు నమలడం వల్ల జీర్ణక్రియ బలపడుతుంది. అలాగే వికారం, వాంతుల వంటి సమస్యల నివారణకు కూడా యాలకులను సహజ ఔషధంగా వాడతారు. యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉన్న విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వివరిస్తున్నారు.

5 / 5
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్

మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..

ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్

ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..

ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..

మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి

ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ

విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్

7 వైడ్లు, 4 నోబాల్స్.! పిల్లబచ్చా జట్టుపై 17 బంతులు ఓవర్‌..

వడోదరలో విరాట్ విధ్వంసం..సెంచరీ మిస్సైనా రికార్డుల పంచ్ అదిరింది