Aadhaar Card: ఉచితంగా ఆధార్‌ వివరాలు అప్‌డేట్‌.. గడువు పొడగిస్తూ నిర్ణయం..

ప్రస్తుతం ఆధార్‌ కార్డ్ వినియోగం అనివార్యంగా మారింది. సిమ్‌ కార్డు మొదలు కారు కొనుగోలు వరకు ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. అంతలా ఆధార్‌ కార్డ్ జీవితంలో ఓ భాగమైపోయింది. ఇదిలా ఉంటే ఆధార్‌ కార్డు వివరాలను పదేళ్లుగా అప్‌డేట్ చేసుకోని వారిని వెంటనే అప్‌డేట్ చేసుకోమని యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది...

Narender Vaitla

|

Updated on: Feb 05, 2024 | 9:03 PM

గడిచిన పదేళ్లుగా ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోని వారి కార్డులను ఇన్‌వాలిడ్‌గా గుర్తిస్తామని అధికారులు తెలిపిన విషయం విధితమే. అందుకే ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు.

1 / 5
అడ్రస్‌ మొదలు, ఫోన్‌ నెంబర్‌, పేరులో మార్పులు, ఫొటో ఇలా.. ఏదైనా ఒక అప్‌డేట్‌ చేయాలని అధికారులు సూచించారు. దీంతో ఆధార్‌ కార్డును సదరు వ్యక్తి ఉపయోగిస్తున్న విషయం తెలుస్తుందనేది అధికారుల ఉద్దేశం.

2 / 5
ఇదిలా ఉంటే ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి గడువును పొడగించింది. ఇప్పటికే పలుసార్లు గడువును పొడగిస్తూ వస్తున్న అధికారులు తాజాగా మరో సారి చివరి తేదీని పొడగించారు.

3 / 5
ఆధార్‌ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడానికి గడువును మరో మూడు నెలల పొడగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మార్చి 31వ తేదీ వరకు గడువును పొడగించారు. దీంత ఎలాంటి ఫీజు లేకుండా వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు.

4 / 5
ఇదిలా ఉంటే ఆధార్‌ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకోవడానికి ముందుగా https://myaadhaar.uidai.gov.in/.అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి. ప్రస్తుత ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేసి ధృవీకరించుకోవాలి. అప్‌డేట్ ఆధార్ ఆన్‌లైన్ ప్రక్రియను ఎంచుకోవాలి. ప్రొసీడ్ టు  అప్‌డేట్ ఆధార్ కార్డులో కావల్సిన వివరాలు నమోదు చేసుకోవాలి. మీ అప్‌డేట్ స్టేటస్ చెక్ చేసేందుకు 14 నెంబర్ల యూఆర్ఎన్ నెంబర్ సిద్ధంగా ఉంచుకోవాలి.

5 / 5
Follow us