- Telugu News Photo Gallery Business photos SBI alerts their customers about fraud messages, Check here for full details
Bank Alert: మీక్కూడా బ్యాంకు నుంచి ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా? అలర్ట్ అవ్వండి..
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. రకరకాల విధానాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ప్రపంచంలో ఎక్కడో కూర్చొని మన ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగం సంస్థ ఎస్‌బీఐ కస్టమర్లకు కీలక అలర్ట్ చేసింది. కొన్ని రకాల మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది...
Updated on: Feb 05, 2024 | 9:59 PM

ఆన్‌లైన్ నేరాలపై కస్టమర్లకు అవగాహన కల్పించే ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి మెస్సేజ్‌లకు స్పందించవద్దని, ఓటీపీ షేర్ చేయవద్దని, ఏ విధమైన వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని కోరుతోంది. అలా చేస్తే సైబర్ నేరాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది.

త్వరలోనే మీ ఖాతా క్లోజ్ అవుతుంది అంటూ వచ్చే మెసేజ్‌లపై స్పందించవద్దని, అవి కేవలం మోసపూరిత మెసేజ్‌లని ఎస్‌బీఐ తెలిపింది. ఏ విధమైన వ్యక్తిగత సమాచారం లేదా ఓటీపీ లేదా ఎక్కౌంట్ వివరాలు ఇవ్వద్దని కస్టమర్స్‌ను అలర్ట్ చేసింది.

పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవుతుందనే మెసేజ్ వస్తుంది. లింక్‌ను క్లిక్ చేసి పాన్‌ను అప్‌డేట్ చేసుకోమని సదరు మెసేజ్‌లో ఉంటుంది. పొరపాటున లింక్ క్లిక్ చేశారో మీ పని అంతేనని అధికారులు చెబుతున్నారు.

ఇలాంటి మెసేజ్‌లు వస్తే వెంటనే అలర్ట్ కావాలని సూచిస్తున్నారు. report.phishing@sbi.co.in.లకు రిపోర్ట్ చేయాలని సూచించింది. లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930ను సంప్రదించాలని చెబుతోంది. అలాగే సైబర్ క్రైమ్ బ్రాంచ్ వెబ్‌సైట్ https://cybercrime.gov.in/. సందర్శించి ఫిర్యాదు చేయాలి.

ఇదిలా ఉంటే ఎవరైనా సైబ్ క్రైమ్ బారిన పడితే వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల డబ్బు కోల్పోకుండా జాగ్రత్త పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. బ్యాంకులు సైబర్ ఫ్రాడ్‌ను ఎదుర్కొనేందుకు ఇన్సూరెన్స్ తీసుకుంటుంటాయి. దీనిద్వారానే బ్యాంకులు డబ్బులు తిరిగి చల్లిస్తాయి.




