- Telugu News Photo Gallery Business photos Top Quotes of Ratan Tata Which Can Change Your Life Philosophy
Ratan Tata Quotes: మీ జీవితాన్ని మార్చే ఈ 8 రతన్ టాటా కోట్స్!
రతన్ టాటా పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఉద్యోగంలో సమయ వేళలు, అతని వివిధ దాతృత్వ కార్యక్రమాలు దేశంలోని 1.8 బిలియన్ల ప్రజల హృదయాల్లో చోటు కల్పించాయి..
Updated on: Oct 10, 2024 | 8:50 PM

రతన్ టాటా పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. ఉద్యోగంలో సమయ వేళలు, అతని వివిధ దాతృత్వ కార్యక్రమాలు దేశంలోని 1.8 బిలియన్ల ప్రజల హృదయాల్లో చోటు కల్పించాయి.

రతన్ టాటా జీవితమంతా ఆదర్శాల తెరిచిన పుస్తకం లాంటిది. విజయ శిఖరాలకు చేరుకున్న తర్వాత కూడా మన పాదాలను నేలపై ఎలా ఉంచుకోవాలో మనకోసం కాదు, దేశం కోసం ఎలా ఆలోచించాలో రతన్ టాటా నేర్పించారు. అతని నుండి కొన్ని కోట్స్ మీ జీవితాన్ని మార్చగలవు.

ఇనుమును ఎవ్వరు నాశనం చేయలేరు. కానీ దాని సొంత తుప్పే దానిని నాశనం చేసేలా చేస్తుంది. అలాగే ప్రతి మనిషి కూడా అంతే.. వారిని ఎవరు నాశనం చేయకపోయినా వారి ఆలోచనలో నాశనం చేసేలా చేస్తాయి. అలాగే ప్రజలు మీపై విసిరే విమర్శలను స్వీకరించండి. వాటిని మీ విజయానికి స్మారక చిహ్నం నిర్మించడానికి ఉపయోగించండి.

జీవితంలో ఎదుగుదల, పతనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ECGలో కూడా స్టెయిట్ లైన్స్ వస్తే మనం సజీవంగా లేమని అర్థం. మీరు వేగంగా వెళ్లాలనుకుంటే, ఒంటరిగా నడవండి. కానీ మీరు చాలా దూరం వెళ్లాలనుకుంటే అందరితో కలిసి వెళ్లండి.

నాయకత్వం అంటే బాధ్యత వహించడం కాదు. మీ క్రింద ఉన్న ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకోవడం నిజమైన నాయకత్వం. విజయం అనేది మీ స్థానాన్ని బట్టి కాదు.. ఇది ఇతరులపై మీరు చూపే ప్రభావాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.

నాకు అదృష్టం మీద నమ్మకం లేదు. నేను ప్రిపరేషన్, హార్డ్ వర్క్‌ని నమ్ముతాను. కరుణ, దయ ఒక నాయకునికి గొప్ప బలాలు.




