- Telugu News Photo Gallery Business photos State Bank of India announces special offers .. festival offer on car loans
SBI Offer: కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? పండగ సీజన్‌లో ఎస్‌బీఐ బంపర్ ఆఫర్
SBI Offer: కొత్త కారు కొనుగోలు చేసేవారికి ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి బ్యాంకులు. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర లోన్స్ కాకుండా కార్లపై కూడా మంచి ఆఫర్లను ..
Updated on: Oct 05, 2021 | 6:57 AM

SBI Offer: కొత్త కారు కొనుగోలు చేసేవారికి ఎన్నో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి బ్యాంకులు. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర లోన్స్ కాకుండా కార్లపై కూడా మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా దేశీ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కస్టమర్ల కోసం పండగ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. కొత్త కారు కొనుగోలు చేసే వారు పలు రకాల ప్రయోజాలు పొందవచ్చు.

యోనో యాప్ ద్వారా లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటే 0.5 శాతం వడ్డీ రేటు తగ్గుతుంది. అలాగే జీరో ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా ఉంటుంది. ఇంకా లోన్ కోసం తక్షణ సూత్రప్రాయ ఆమోదం లభిస్తుంది.

అలాగే ప్రియారిటీ డెలివరీ, ఉచిత యాక్ససిరీస్ వంటి అదనపు ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. యోనో యాప్‌లోకి వెళ్లి నేరుగా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇకపోతే కారు లోన్‌పై వడ్డీ రేటు 7.25 శాతం నుంచి ప్రారంభమౌతోంది.

ఇలా పండగ సీజన్‌లోనే కాకుండా అప్పుడప్పుడు ఎస్‌బీఐ చాలా రకాల ప్రయోజనాలు కల్పిస్తోంది. ఇది వరకు వాహనాల విషయంలో ఎన్నో ఆఫర్లను ప్రకటించింది. తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తోంది. అంతేకాదు సీనియర్ సిటిజన్స్ విషయంలో కూడా అదనపు ప్రయోజనాలు అందిస్తోంది ఎస్‌బీఐ.




