- Telugu News Photo Gallery Business photos SBI Card has dropped the veil off its new offer! Earn cashback of up to Rs. 10,000 on online shopping!
SBI Offer: కస్టమర్లకు ఎస్‌బీఐ బంపర్ ఆఫర్.. షాపింగ్ చేస్తే 10 వేల వరకు క్యాష్‌బ్యాక్.. ఎలాగంటే..!
SBI Offer: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెట్టడంతో ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా తన వినియోగదారులకు మరో ఆఫర్ ప్రకటించింది..
Updated on: Oct 04, 2021 | 8:49 AM

SBI Offer: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెట్టడంతో ఎన్నో ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా తన వినియోగదారులకు మరో ఆఫర్ ప్రకటించింది. పండుగ సీజన్ నేపథ్యంలో భారీ తగ్గింపు అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ మాత్రమే. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేసే వారికి ఏకంగా రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.

అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 5 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం లభిస్తోంది. ఒక్కో కార్డుపై గరిష్టంగా రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. పండగ సీజన్ షాపింగ్‌లో భాగంగా కనీసం కార్డు ద్వారా రూ.7500 వరకు షాపింగ్ చేస్తే రూ.1750 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

అదే కార్డు ద్వారా రూ.లక్ష కొనుగోలు చేస్తే.. రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దిగ్గజ ఈకామర్స్ సైట్లలో మొబైల్స్, కన్సూమర్ డ్యూరబుల్స్, ల్యాప్‌టాప్స్, కిచెన్ అప్లయెన్సెస్, హోమ్ డెకోర్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌లో ఇలా ఏ ప్రొడక్టులు కొనుగోలు చేసిన ఆఫర్ వర్తిస్తుంది.

ఈ మేరకు ఈ ఆఫర్‌కు సంబంధించి ట్వీటర్‌లో పోస్టు చేసింది ఎస్‌బీఐ. ఇలా ఎస్‌బీఐ రకరకాల ఆఫర్లను అందిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటోంది.

బ్యాంకు నుంచి హోమ్ లోన్స్, వ్యక్తిగత లోన్స్, ఇతర రుణాలను అందించడమే కాకుండా ఇలాంటి ఆఫర్లను ప్రకటిస్తోంది. అంతేకాకుండా రుణాలపై తక్కవ వడ్డీని ఆఫర్ చేస్తోంది. వినియోగదారులకు మేలు జరిగే ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది.




