- Telugu News Photo Gallery Business photos Mobile 5g smartphones under Rs 10000 discount offer on flipkart infinix, itel, tecno, poco, motorola
5G Smartphones: ఈ అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లు 10 వేల కన్నా తక్కువ ధరకే.. బెస్ట్ ఆఫర్స్!
Smartphones: తరచుగా ప్రజలు తక్కువ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా ఇష్టపడతారు. తక్కువ ధరలకు ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను ప్రజలు ఇష్టపడతారు. అటువంటి పరిస్థితిలో మీ బడ్జెట్ కూడా రూ. 10 వేలు అయితే, మీరు గొప్ప 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న అనేక డీల్‌లు అద్భుతమైన ఆప్షన్‌గా ఉంటుంది. బడ్జెట్ విభాగంలో అనేక బ్రాండ్లు 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేశాయని, ఫ్లిప్‌కార్ట్ వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. ఇది వాటి ధరను మరింత తగ్గిస్తుంది.
Updated on: Apr 06, 2025 | 4:40 PM

ఇన్ఫినిక్స్ హాట్ 50 5G బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్. దీనిలో 4GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం రూ.9,499కి ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ చేయబడింది. మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగించి చెల్లిస్తే, మీరు రూ. 500 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. దీని వలన ధర రూ. 8,999 కి తగ్గుతుంది. ఇతర ఆఫర్లను తీసుకుంటే మరింత తగ్గే అవకాశం ఉంది.

itel P55 5G కూడా బడ్జెట్ ఫోన్. దీనిలో 6GB RAM, 128GB స్టోరేజ్ ఉన్నాయి. దీని ధర రూ. 8,990. కానీ మీరు BOBCARD ద్వారా EMI లావాదేవీ చేస్తే మీరు 10% వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే దాదాపు రూ. 900, దీని కారణంగా ఈ ఫోన్ రూ. 8,099 అవుతుంది.

టెక్నో స్పార్క్ 30C 5G కూడా 4GB RAM+ 64GB స్టోరేజ్‌ను అందించే గొప్ప చవకైన ఎంపిక. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.9999కి లిస్ట్ చేయబడింది. మీరు HDFC బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగిస్తే, మీరు రూ.750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీని ధర రూ.9,249కి తగ్గవచ్చు.

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో Poco C75 5G కూడా వస్తుంది. ఈ ఫోన్ కేవలం రూ.7,999కే ఫ్లిప్‌కార్ట్‌లో ఉంది. మీరు IDFC FIRST బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో చెల్లిస్తే, మీరు రూ.750 వరకు తగ్గింపు పొందవచ్చు. మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ.7,599కే పొందవచ్చు.

Motorola G35 5G కూడా ఈ శ్రేణిలో శక్తివంతమైన ఫోన్. దీని ధర రూ. 9,999. IDFC FIRST డెబిట్ కార్డ్ ఉపయోగించి చేసిన కొనుగోలుపై రూ. 750 తగ్గింపు కూడా ఉంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే ఆఫర్ కింద రూ. 5,600 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లన్ని కూడా ఈ ఆఫర్లే కాకుండా మరిన్ని ఆఫర్లు పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆఫర్లు పెంచే అవకాశాలు ఉంటాయని గుర్తించుకోండి.





























