- Telugu News Photo Gallery Business photos Best Business Idea Potato Making Business Gives You Rs 50 Thousand Per Month, Check Details
Business Ideas: చదువు లేకున్నా పర్లేదు.! ఈ వ్యాపారంతో ప్రతీ నెలా రూ. 50 వేలు మీ సొంతం..
పెద్దగా చదువుకాలేదా.? లేదా మీరనుకున్న జాబ్ దొరక్కట్లేదా.. అయితే డోంట్ వర్రీ.! మీకోసం ఓ బిజినెస్ ఐడియా తీసుకొచ్చేశాం. ఎలాంటి రిస్క్ ఉండదు. బెస్ట్ బిజినెస్ లాభాలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువే వస్తాయి. మరి అదేంటో చూసేద్దాం. ఆ వివరాలు..
Updated on: Aug 06, 2025 | 7:56 AM

తమ స్థోమతకు తగ్గట్టుగా పిల్లలకు చదువులు చెప్పిస్తుంటారు తల్లిదండ్రులు. మనం ఏ ఇంటర్, లేదా టెన్త్ వరకే చదివి.. ఉద్యోగం తెచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంటే.. మీకోసమే ఇది. తక్కువ చదువు చదివేం అని ఆందోళన చెందాల్సిన పన్లేదు. సరైన జాబ్ దొరక్క ఇంట్లో కూర్చున్నా.! టెన్షన్ అవసరం లేదు. ఓ బిజినెస్ ఐడియాను తీసుకొచ్చేశాం. ఎలాంటి రిస్క్ లేకుండా ఈ వ్యాపారంతో మీరు లాభాలు తెచ్చుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ వ్యాపారం ఏంటని ఆలోచిస్తున్నారా.? పొటాటో చిప్స్ తయారీ.! ఈ బిజినెస్‌కు పెద్దగా పెట్టుబడి అక్కర్లేదు. అలాగే లాభాలు కూడా మంచిగానే వస్తాయి. ఇక చిప్స్ తయారీకి మీకు పెద్ద పెద్ద మిషన్లు అవసరం లేదు. కేవలం చిన్నపాటి పరికరాలు ఉంటే చాలు. చెప్పాలంటే రిస్క్ లేని బెస్ట్ బిజినెస్ ఇది

బంగాళదుంప చిప్స్ తయారీకి మీకు కావాల్సిందల్లా బంగాళదుంపలు, నూనె, ఉప్పు, మసాలా, ముక్కలను కట్ చేస్తే కట్టర్, ఒక పెద్ద మూకుడు. ఇక ఫ్రై చేసిన వాటిని అమ్మేందుకు చిన్న సైజ్ కవర్ ప్యాకెట్లు. నార్మల్‌గా మీ ఇంట్లో ఓ షెడ్డులాంటిది ఉంటే.. షాప్‌లా సెటప్ చేసుకుని స్థానికంగా అమ్ముకోవచ్చు. లేదా హోల్‌సేల్ షాపులకు అమ్మితే ముడిసరుకుపై చేసిన ఖర్చు కంటే ఎక్కువ లాభమే వస్తుంది.

సుమారు 10 కిలోల బంగాళదుంప చిప్స్ అమ్మితే.. దాదాపుగా రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకు సంపాదించవచ్చు. అలాగే మనం స్థానికంగా కుదుర్చుకునే షాప్‌ల సంఖ్య బట్టి.. ఎంతకాదనుకున్నా రోజుకు మూడు నుంచి నాలుగు వేల వరకు సంపాదన వస్తుంది.

ఈ బిజినెస్‌లో క్వాలిటీ, క్వాంటిటీ అనేది చాలా ముఖ్యం. ఆ రెండింటిని మీరు మెయింటైన్ చేయగలిగితే.. సేల్స్ విపరీతంగా పెరుగుతాయి. లాభాలు కూడా మీరు అనుకున్న దానికంటే ఎక్కువే వస్తాయి. అలాగే సోషల్ మీడియా అకౌంట్ల సాయంతో మార్కెటింగ్ చేస్తే.. కచ్చితంగా నెలకు రూ. 50 వేల నుంచి రూ. 60 వేలు మీ సొంతం.




