- Telugu News Photo Gallery Business photos Amazon india announces small business days sale from this date
Amazon Small Business: అమెజాన్ ఇండియా స్మాల్ బిజినెస్ డేస్.. జూలై 2 నుంచి ప్రారంభం
Amazon Small Business: ఆన్‌లైన్ బిజినెస్ దిగ్గజం అమెజాన్ బుధవారం నుంచి భారత్‌లో స్మాల్ బిజినెస్ డేస్ 2021ను ప్రారంభించనుంది. జూలై 2 నుంచి 4వ తేదీ వరకు ..
Updated on: Jun 27, 2021 | 3:12 PM

Amazon Small Business: ఆన్‌లైన్ బిజినెస్ దిగ్గజం అమెజాన్ శుక్రవారం నుంచి భారత్‌లో స్మాల్ బిజినెస్ డేస్ 2021ను ప్రారంభించనుంది. జూలై 2 నుంచి 4వ తేదీ వరకు ఈ సేల్స్ అందుబాటులో ఉండనుంది. ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారస్థులు తిరిగి పుంజుకోవడం కోసం ఇలా ప్లాన్ చేసినట్లు అమెజాన్ పేర్కొంది. కరోనా కారణంగా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలహీనపడిన విషయం అందరికి తెలిసిందే.

అయితే ఈవెంట్లో లక్షల్లో మాన్యుఫాక్చరర్లు పాల్గొంటున్నారు. వెయ్యి స్టార్టప్ బ్రాండ్లు లాంచ్ ప్యాడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 6.8 లక్షల మహిళా ఎంట్రీప్రెన్యూర్స్ అమెజాన్ కుటుంబంలో చేరుతున్నారు. లోకల్ షాప్స్ నుంచి 50 వేలకు పైగా పొరుగు స్టోర్ల వ్యాపారస్థులు అమెజాన్ ప్రోగ్రాంలో ఒకటవుతున్నారు.

ఈ మూడు రోజుల పాటు జరిగే సేల్స్‌లో భాగంగా అమెజాన్ అందిస్తున్న డీల్స్ తో.. పలు క్యాటగిరీల్లోని ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేసుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్లు, వాతావరణానికి తగ్గట్లు వాడుకునే క్రీములు, హోం ఫిట్‌నెస్ సరఫరా, ప్రాంతీయ కళాకృతులు లాంటివన్నీ మార్కెట్ ప్లేస్ లో లభిస్తాయి.

వీటి ఎగుమతులతోనే దేశానికి 30 శాతం జీడీపీ సమకూరుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న 6 కోట్ల ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లు 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కాగా, సామాజికాభివృద్ధికి తోడ్పడుతున్న ఈ వ్యవస్థ బలపడేందుకు మరింత ఉపాధి అవకాశాలు పెంచాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.





























