- Telugu News Photo Gallery Business photos Hero motocorp to hike prices of two wheelers details inside
Hero Motocorp: కొత్త బైక్ కొనుగోలు చేసే వారికి షాకింగ్ న్యూస్.. వచ్చే నెల నుంచి పెరగనున్న ధరలు
Hero Motocorp: కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే ధరలు పెరిగే అవకాశాలున్నాయి. జూలై నెల నుంచి బైక్స్ ధరలు పెరగబోతున్నాయి..
Updated on: Jun 23, 2021 | 2:45 PM

Hero Motocorp: కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే కొనేయండి. ఎందుకంటే ధరలు పెరిగే అవకాశాలున్నాయి. జూలై నెల నుంచి బైక్స్ ధరలు పెరగబోతున్నాయి. దీంతో కొత్తగా బైక్ కొనుగోలు చేయాలంటే ఎక్కువ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది.

దేశీ అతిపెద్ద టూవీలర్ వాహనాల తయీరీ సంస్థ హీరో మోటొకార్ప్ ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించింది. మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ధర పెంచుతున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. టూవీలర్ల ధర రూ.3 వేల వరకు పెరుగుతుందని వెల్లడించింది. ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

ఇప్పటికే దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపిన హీరో.. జూలై నుంచి ధరల టూవీలర్ వాహనాల పెంపు ఉంటుందని తెలిపింది. మారుతీ సుజుకీ తర్వాత ఇప్పుడు హీరో మోటొకార్ప్ కూడా ధరల పెంపును ప్రకటించడం గమనార్హం.

స్టీల్, కాపర్ సహా పలు కమొడిటీ ధరలు పెరిగాయని, అందుకే ధరలు పెంచుతున్నామని హీరో మోటొకార్ప్ తెలిపింది. ధరల పెంపు నిర్ణయం జూలై 1 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. కొనుగోలుదారులపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు వ్యయాల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ తెలిపింది.





























