- Telugu News Photo Gallery Burn banana plantation due to high tension electric wires shot circuit in Kadapa District
అగ్గికి ఆహుతైన అరటి తోట.. బుగ్గిపాలైన రైతు కష్టం..
12 ఎకరాలలో వేసిన సుగంధి రకానికి చెందిన అరటిపంట పూర్తిగా దగ్ధమైంది. 11 కె.వి విద్యుత్ వైర్లు నుంచి మంటలు రావడంతో పంట మొత్తం కాలి బూడిదైంది. కడప జిల్లా కాశినాయన మండలం శివరామ పల్లగిరి దగ్గర 11kv విద్యుత్ లైన్ నుంచి మంటలు వ్యాపించి సుగంధం అరటి పంటకు మంటలు అంటుకోవడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు రైతులు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Updated on: Mar 02, 2024 | 9:50 PM

ఎండనక వాననక కష్టపడి చెమటోడ్చి పండించిన పంట తీరా చేతికి వచ్చే సమయానికి బుగ్గిపాలు కావడంతో రైతన్నలు లబోదిబోమంటున్నారు . 12 ఎకరాలలో వేసిన సుగంధి రకానికి చెందిన అరటిపంట పూర్తిగా దగ్ధమైంది.

11 కె.వి విద్యుత్ వైర్లు నుంచి మంటలు రావడంతో పంట మొత్తం కాలి బూడిదైంది. కడప జిల్లా కాశినాయన మండలం శివరామ పల్లగిరి దగ్గర 11kv విద్యుత్ లైన్ నుంచి మంటలు వ్యాపించి సుగంధం అరటి పంటకు మంటలు అంటుకోవడంతో ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు రైతులు. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అప్పటికే సుమారుగా 12 ఎకరాలకు పైగా చేతికి అంది వచ్చిన పంట, డిప్పు పరికరాలు అగ్నికి ఆహుతి కావడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు పంట నష్టపోయిన ముగ్గురు రైతన్నలు.. సుమారుగా 14 లక్షలు పైగా నష్టపోయాం అంటూ ఆవేదన చెందారు. రైతులకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని వేడుకుంటున్నారు.

వెల్దుర్తి గాయిత్రికిచెందిన 5ఏకరాలుసుగంధ అరటి పంట పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. అక్షరాల ఐదు లక్షల రూపాయలు పంట నష్టం, లక్ష రూపాయల విలువైన డ్రిప్పు పరికరాలు డ్రిప్పు పైపులు కాలి బూడిదయ్యాయి. మారో రైతు భాగ్యమ్మకు చెందిన 5ఏకరాల సుగంధం అరటి పంట కూడ ఆగ్నికి ఆహుతి అయిందని 6 లక్షల రూపాయలు నష్టం జరిగిందనిరైతులు వాపోయారు.

మరో రైతు కు చెందిన 2ఏకరాలలో 2.5 లక్షలు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకొని సాయం అందించవలసిందిగా వేడుకుంటున్నారు. పంట పొలాల పైనుంచి హై టెన్షన్ వైరు వెళ్లడం.. అక్కడ నుంచి అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగటం.. అవి పొలాలలో ఉన్న పంటపై పడటంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.




