Soaked Chana Benefits: రోజూ నానబెట్టిన శనగలు తింటే ఇన్ని లాభాలా..! గుండెకు కొండంత బలం..
నానబెట్టిన పచ్చి శనగలను పోషకాహార పవర్‌హౌస్ అని అంటారు. పచ్చి శనగలను నీటిలో నానబెట్టి తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే, శరీరానికి బహుళ ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. ప్రోటీన్ లభించే వెజిటబుల్స్‌లో శనగలు ముఖ్యమైనవి. పచ్చి శనగల్లోని ప్రొటీన్ కండరాల నిర్మాణానికి, శరీర బహుళ విధులకు, రక్త ప్రసరణలో సహాయపడుతుంది. పచ్చి శనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారం శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. పచ్చి శనగలు క్రమం తప్పకుండా తినడం వల్ల జ్వరం, జలుబు వంటివి దరిచేరవు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




