- Telugu News Photo Gallery Ayurvedic tips do not eat these things if you facing itching and fungal infection in Telugu
Ayurvedic tips: చర్మంపై దద్దుర్లు, దురద సమస్య ఉందా?.. అయితే, పొరపాటున కూడా వీటిని తినొద్దు..!
Ayurvedic tips: రకరకాల కారణాల వల్ల చర్మంపై దద్దుర్లు, బెందులు వస్తుంటాయి. సీజనల్ ఎఫెక్ట్స్, మనం తినే ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ సమస్యలు ఎదురవ్వొచ్చు. అయితే, మీ చర్మంపై ర్యాషెస్, దురద, దద్దుర్లు ఉన్నట్లయితే కొన్ని రకాల..
Updated on: Jun 16, 2022 | 6:20 AM

Ayurvedic tips: రకరకాల కారణాల వల్ల చర్మంపై దద్దుర్లు, బెందులు వస్తుంటాయి. సీజనల్ ఎఫెక్ట్స్, మనం తినే ఆహార పదార్థాల ద్వారా కూడా ఈ సమస్యలు ఎదురవ్వొచ్చు. అయితే, మీ చర్మంపై ర్యాషెస్, దురద, దద్దుర్లు ఉన్నట్లయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తినొద్దని ఆయుర్వేదం చెబుతోంది. మరి ఆ పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పాల ఉత్పత్తులు: అలర్జీ సమస్యతో బాధపడుతున్నట్లయితే, చర్మ వ్యాధులను ఎదుర్కొంటున్నట్లయితే.. పాలు, పెరుగు లేదా వెన్న వంటి పాల ఉత్పత్తులను అస్సలు తీసుకోవద్దు. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

నువ్వులు: నువ్వులను ఎక్కువగా తీసుకుంటే చర్మ సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. దీంతో పాటు, జీర్ణవ్యవస్థ చెదిరిపోతుంది. పొట్ట ప్రాంతంలో కొవ్వు పెరుగుతుంది.

పుల్లని పదార్థాలు: ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పుల్లని పదార్థాలు శరీరంలో పైత్యరసం పెరగడానికి కారణం అవుతుంది. అదే జరిగితే రక్తంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. మీరు చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. పుల్లని పదార్థాలను అస్సలు తినొద్దు. ఒకవేళ తినాలనుకుంటే.. దానికంటే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

బెల్లం: చర్మ వ్యాధులతో బాధపడేవారు బెల్లం వంటి తీపి పదార్థాలకు దూరంగా ఉండాలని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఇది శరీరంలో వేడిని పెంచుతుంది. దీని కారణంగా ప్రభావిత ప్రాంతంలో దురద పెరగుతుంది.





























