- Telugu News Photo Gallery Avoid These Major Charging Mistakes to Save Your Smartphone, Check Details
Phone Charging: ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ బ్యాటరీ పని అయిపోయినట్లే..
ఈ రోజుల్లో సెల్ ఫోన్ అనేది మన జీవితంలో అత్యవసరంగా మారిపోయింది. చేతిలో ఫోన్ లేకపోతే ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అయితే చాలా మంది తమ ఫోన్‌లను ఛార్జ్ చేసే విషయంలో ఎన్నో తప్పులు చేస్తున్నారు. ఈ పొరపాట్ల వల్ల మీ ఫోన్ బ్యాటరీ త్వరగా పాడైపోతుంది. సెల్ ఫోన్ లైఫ్ తగ్గిపోతుంది. మీ ఫోన్ బ్యాటరీ దెబ్బతినకుండా ఉండాలంటే ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని చిట్కాలను తప్పక పాటించాలి.
Updated on: Oct 08, 2025 | 3:36 PM

స్విచ్ఛాఫ్ అయ్యే వరకు వాడటం: చాలా మంది బ్యాటరీ స్థాయి సున్నాకి చేరుకునే వరకు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు ఫోన్‌ను ఉపయోగిస్తారు. మరికొందరు 5 శాతం కంటే తక్కువ అయ్యే వరకు ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల బ్యాటరీపై అధిక ఒత్తిడి పడి, అది త్వరగా దెబ్బతింటుంది.

100శాతం వరకు ఛార్జ్: కొంతమంది తమ ఫోన్‌లను ప్రతిసారీ 100 శాతం వరకు ఛార్జ్ చేస్తారు. టెక్ నిపుణుల ప్రకారం.. ఇలా తరచుగా 100శాతం ఛార్జ్ చేస్తే, కాలక్రమేణా ఫోన్ బ్యాటరీ చెడిపోతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాటరీపై ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

మీ సెల్ ఫోన్ బ్యాటరీని సురక్షితంగా, ఎక్కువ కాలం పనిచేసేలా ఉంచడానికి చాలా మంది టెక్ నిపుణులు 20-80 రూల్ పాటించాలని సూచిస్తున్నారు. దీన్ని వల్ల బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.

20-80 రూల్ అంటే..?: మీరు మీ ఫోన్‌ను ఉపయోగిస్తున్నప్పుడు.. బ్యాటరీ ఛార్జ్ 20శాతం కంటే తక్కువ కాకుండా చూసుకోండి. బ్యాటరీ 20 శాతం కంటే తగ్గితే వెంటనే ఛార్జ్ చేయండి. మీ సెల్ ఫోన్ బ్యాటరీని 100 శాతం వరకు కాకుండా 80 నుండి 90 శాతం వరకు మాత్రమే ఛార్జ్ చేయాలి. 80శాతం ఛార్జ్ అయిన వెంటనే ఛార్జర్‌ను తీసివేయండి.

ఈ 20-80 నియమాన్ని పాటించడం ద్వారా బ్యాటరీపై ఒత్తిడి తగ్గుతుంది. దీని వల్ల మీ సెల్ ఫోన్ బ్యాటరీ దెబ్బతినకుండా.. దాని లైఫ్ సైకిల్ మెరుగవుతుంది. మీ ఫోన్ ఎక్కువ కాలం కొత్తదానిలా పనిచేస్తుంది.




