AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోలీవుడ్‌ మీద ఫోకస్‌.. సామ్‌ ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

సక్సెస్‌ అంటే పరుగులు తీయడమే కాదు. కొన్నిసార్లు పరుగు ఆపడం కూడా విజయమే అంటున్నారు సమంత. ''ప్రతి రోజూ టెన్షన్‌. ప్రతి వారం టెన్షన్‌... కొత్త వాళ్లు ఎవరైనా వచ్చేస్తారేమో, మన కిరీటాన్ని వాళ్లు కొల్లగొట్టేస్తారేమో... టాప్‌ టెన్‌లో కొత్తవారు యాడ్‌ అయితే మన పరిస్థితి ఏంటో... ఇలాంటి ఆలోచనలతో కంగారుగా ఉండేది. ఇప్పుడది లేదు. ప్రశాంతంగా ఉన్నా. నాదన్నది నాతోనే ఉంటుందనే క్లారిటీవచ్చింది'' అని ఈ మధ్య ఓపెన్‌ అయ్యారు సామ్‌.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Prudvi Battula|

Updated on: Oct 08, 2025 | 6:31 PM

Share
ఇప్పుడు అదే క్లారిటీతో నిర్ణయాలు తీసుకుంటున్నట్టున్నారు. వరుసగా సినిమాలు చేయనున్నారనే టాక్‌ ఆల్రెడీ స్ప్రెడ్‌ అవుతోంది. ఆ మధ్య సిటాడెల్‌‎లో కనిపించారు సమంత. ఆ తర్వాత రక్త్ బ్రహ్మాండ్‌‎తో టయ్యప్‌ అయ్యారు. అయితే ఆ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఈ మధ్య ఫెస్టివల్‌ సందర్భంగా తన కొత్త ఇంటి ఫొటోలను కూడా షేర్‌ చేసుకున్నారు.

1 / 5
నెట్టింట్లో చిట్‌ చాట్‌ చేస్తూ ఈ నెల్లోనే 'మా ఇంటి బంగారం' సినిమా షూటింగ్‌‎లో పాల్గొంటానని ప్రకటించారు. ఈ మూవీ ఆమె సొంత నిర్మాణ సంస్థలో రానుంది. అయితే సామ్‌ ఆ ఒక్క సినిమాతోనే సరిపెట్టుకోవడం లేదని, బ్యాక్ టు బ్యాక్‌ ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారని కోలీవుడ్‌ సమాచారం.

2 / 5
అందులో భాగంగానే ముందుగా ఆమె శింబు మూవీలో నటిస్తారన్నది టాక్‌. వడచెన్నై.. అంటే నార్త్ చెన్నై నేపథ్యంలో శింబు హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు డైరక్టర్‌ వెట్రిమారన్‌. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రంతోనే సమంత హీరోయిన్‎గా కోలీవుడ్‌‎లో మళ్లీ అడుగుపెడుతున్నారన్నది వైరల్‌ వార్త. వెట్రిమారన్‌ సినిమాల్లో హీరోయిన్ ‌కి స్ట్రాంగ్‌ రోల్‌ ఉంటుందని, ఆ నెరేషనే సామ్‌కి నచ్చిదని చెప్పుకుంటున్నారు.

3 / 5
'కాత్తు వాక్కులే రెండు కాదల్‌' సినిమాతో 2022లో తమిళ ప్రేక్షకులను పలకరించారు సామ్‌. విజయ్‌ సేతుపతి, నయన్‌ నటించిన సినిమా అది. ఆ తర్వాత ఆమె కోలీవుడ్‌‎లో నటించబోయేది శింబు 'అరసన్‌' లోనే. ఈ మూవీ ఎలాగూ తెలుగులోనూ రిలీజ్‌ అవుతుంది కాబట్టి.. ఇక వరుస రిలీజులతో హల్‌ చల్‌ చేయాలన్నది సామ్‌ ప్లాన్‌.

4 / 5
ఓ వైపు సినిమాలు, వెబ్‌ సీరీస్‌లు చేస్తూనే మరోవైపు హెల్త్ మీద ఫోకస్‌ పెడుతున్నారు. ఎప్పటికప్పుడు తన అనుభవాలను సోషల్‌ మీడియా ద్వారా యువతతో పంచుకుంటూనే ఉన్నారు. సక్సెస్‌ అంటే ఉరుకులు పరుగులు కాదని, ప్రశాంతంగా అనుకున్నది చేస్తూ ఆనందంగా ఉండటం అన్నది సామ్‌ ఇస్తున్న లేటెస్ట్ స్టేట్‌మెంట్‌.

5 / 5