- Telugu News Photo Gallery Apple Juice Benefits: Start Drinking Apple Juice Everyday, know its health benefits telugu news
Apple Juice: వామ్మో.. యాపిల్ పండు కాదు.. జ్యూస్‌లో ఇంత మ్యాటర్ ఉందా..?
యాపిల్ పండును రోజూ ఒకటి తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు.. అనే సామెతను అందరూ వినే ఉంటారు. అది అక్షరాలా సత్యం అనే చెప్పవచ్చు. యాపిల్ జ్యూస్‌ను తాగుతున్నా కూడా అలాంటి ప్రయోజనమే కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయాన్నే యాపిల్ జ్యూస్‌ను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. యాపిల్ జ్యూస్‌తో అనేక లాభాలు ఉంటాయని అంటున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Mar 29, 2025 | 6:42 PM

యాపిల్ పండ్లలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి. దీంతో ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా కణాలు డ్యామేజ్ అవకుండా ఉంటాయి. దీంతో గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు రోజూ ఉదయాన్నే యాపిల్ జ్యూస్‌ను తాగితే మంచిది. దీని వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావనలో ఉంటారు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు సైతం రోజూ యాపిల్ జ్యూస్‌ను సేవిస్తుంటే ఎంతో మేలు జరుగుతుంది.

యాపిల్ పండ్లలో విటమిన్ సి అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు యాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జలుబు, ఫ్లూ వంటి చిన్న చిన్న సమస్యల నుంచి కూడా విముక్తి కలుగుతుంది.

యాపిల్ జ్యూస్‌లో ఉండే సమ్మేళనాలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. యాపిల్ జ్యూస్‌ను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని వాపులు, నొప్పులు సైతం తగ్గిపోతాయి. దీంతో ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. కీళ్లు, మోకాళ్ల నొప్పులను తగ్గించుకోవచ్చు.

యాపిల్ జ్యూస్‌ను రోజూ తీసుకోవటం వల్ల చర్మం సైతం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మ కాంతి పెరిగి మృదువుగా మారుతుంది. ముఖంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. యాపిల్ జ్యూస్‌ను తాగితే జీర్ణక్రియ మెరుగు పడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గుండెల్లో మంట ఉండదు. పొట్టలోని గ్యాస్ తగ్గుతుంది.





























